/rtv/media/media_files/2025/02/19/Dvm80RuwEjChD0Tji3QZ.webp)
72nd Miss World
Miss World : ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసే ప్రపంచ అందాల పోటీలకు ఈసారి హైదరాబాద్ వేదిక కానున్నది. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్ లో నిర్వహించాని నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. దీంతో 72వ మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నది.
Also Read: సీఎం సంచలన నిర్ణయం.. అవినీతికి పాల్పడ్డ 52 మంది పోలీసులు సస్పెండ్
చారిత్రక, వారసత్వ సంపదను ప్రపంచానికి చాటడానికి తెలంగాణకు ఇదొక గొప్ప అవకాశం కానున్నది. దాదాపు నాలుగు వారాల పాటు జరిగే ఈ పోటీల ప్రారంభ, ముగింపు వేడుకలతో పాటు గ్రాండ్ ఫినాలేను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. ప్రతిష్టాత్మక మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో 120కి పైగా దేశాలు పాల్గొంటాయి. బ్యూటీ విత్ ఎ పర్పస్ అనే లక్ష్యంతో నిర్వహించబడుతున్న ఈ మిస్ వరల్డ్ అందాల పోటీల్లో పాల్గొనే దేశ విదేశాల ప్రతినిధులకు తెలంగాణ స్వాగతం పలుకుబోతుంది.
Also Read: chhaava: అదిరిపోయింది గురూ.. చావా సినిమా చూడటానికి ఏకంగా గుర్రంపై వచ్చి.. వీడియో వైరల్
మే 7 నుంచి ఈ అందాల పోటీలు జరగనున్నాయి. మే 31న గ్రాండ్ ఫినాలే ఉంటుంది. ప్రస్తుత మిస్ వరల్డ్ తర్వాత అందాల సుందరి కిరీటాన్ని ఎవరు ధరిస్తారో గ్రాండ్ ఫినాలే రోజు తెలుస్తుంది. గతంలో న్యూఢిల్లీ, ముంబైలో ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించారు. 71వ ఎడిషన్ ముంబైలోనే జరిగింది. కాగా 72వ ఎడిషన్ హైదరాబాద్‌లో జరగనున్నది.
Also Read: మొత్తం రూ.16 వేల కోట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా.. RTV చేతిలో సంచలన నిజాలు!
ప్రపంచంలోనే అత్యుత్తమ మౌలిక సదుపాయాలున్న హైదరాబాద్ ఇప్పటికే పలు అంతర్జాతీయ వేడుకలకు వేదికైంది. ఐటీ, ఫార్మాసూటికల్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న తెలంగాణకు ఈ అవకాశం దక్కడం నిజంగా గర్వించదగ్గ విషయం. తెలంగాణను పర్యాటకంగా ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు చేపట్టింది.తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో టూరిజం శాఖ దేశ విదేశీ పర్యాటకులను ఇప్పటికే ఆహ్వానిస్తుంది.
Also Read: Rishab Shetty: ఫ్యాన్స్ కి గూస్ బంప్స్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రిషబ్ శెట్టి.. పోస్టర్ వైరల్
గొప్ప చేనేత వారసత్వం.. అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు.. అరుదైన వంటకాలు.. విభిన్నమైన కళా వారతస్వమున్న తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలను స్వాగతిస్తున్నామని..మరో అంతర్జాతీయ ఉత్సవానికి వేదిక హైదరాబాద్ వేదిక కానున్నదని మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్మెన్, సీఈఓ జూలియా మోర్లీ, తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఈ సందర్భంగా అధికారిక ప్రకటన చేశారు.
ఇది కూడా చదవండి: VIRAL VIDEO: ఒర్లకండిరా బాబు.. దండం పెడతా.. కార్యకర్తలపై కేసీఆర్ సీరియస్!