ఖమ్మం, భదద్రికొత్త గూడెం, మహబూబాబాద్ జిల్లాల ప్రజలకు సాగు నీరు, త్రాగు నీటితో పాటు పారిశ్రామిక అవసరాలను తీర్చేందుకు సీతారాం లిఫ్ట్ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం రూట్ మ్యాప్‌ను రూపొందించాలని సూచించారు. అలాగే ఇందుకు అవసరమైన భూసేకరణ కోసం ప్రత్యేక సర్వే బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
Also Read: తెలంగాణలో సీఎం మార్పు.. మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన!
2025లో పూర్తి చేస్తాం
సీతారాం లిఫ్టు ప్రాజెక్ట్ నిర్మాణపు పనులపై శనివారం ఎర్రమంజిల్ కాలనీలోని జలసౌధలో మంత్రి ఉత్తమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జులై 2025 లక్ష్యంగా ఈ సీతారం లిఫ్ట్ ప్రాజెక్టును పూర్తి చేయాలనేదే రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం అన్నారు. ఇప్పటిదాకా ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి గాను 6,234.91 ఎకరాల భూమికి సేకరించినట్లు ఆయన వివరించారు. ఇంకా 993 ఎకరాలు సేకరించాల్సి ఉందని అన్నారు. అందుకే త్వరగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Also Read: ఉగ్రవాదులకు సరైన బదులిస్తాం.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
ప్రాజెక్ట్ పూర్తి అయితే 3.28 లక్షల కొత్త ఆయాకట్టు సేద్యంలోకి వస్తుందన్నారు. 550 చెరువులకు సమృద్ధిగా నీరు చేరుతుందన్నారు. తద్వారా అదనంగా మరో 1.16 లక్షల ఏకరాలు సేద్యంలోకి వస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌పై 6,401.95 కోట్లు ఖర్చు పెట్టినట్లు పేర్కొన్నారు. యుద్దప్రాతిపదికన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,నీటిపారుదల శాఖా ముఖ్య కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: ఇంట్లో దొంగలు పడ్డారు వెంటనే రండి సర్.. తీరా చూస్తే పోలీసులు షాక్!
Also Read: స్టాక్ మార్కెట్లోకి తెలుగు..మొబైల్ యాప్ లాంచ్ చేసిన ఎన్‌ఎస్‌ఈ