CM Revanth: తెలంగాణలో సీఎం మార్పు.. మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన! తెలంగాణలో సీఎం మార్పు అనేది ఉండదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేవారు. మరో నాలుగేళ్ల ఒక నెల రేవంత్ రెడ్డే సీఎంగా కొనసాగుతారన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి మారబోతున్నారంటూ బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలకు పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. By Nikhil 02 Nov 2024 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి తెలంగాణలో సీఎం మార్పు అనేది ఉండదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేవారు. మరో నాలుగేళ్ల ఒక నెల రేవంత్ రెడ్డే సీఎంగా కొనసాగుతారన్నారు. మరోసారి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. అప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి మారబోతున్నారంటూ బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యలకు పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. డిసెంబర్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. జనవరిలో గ్రామాలకు కొత్త సర్పంచ్ లు వస్తారన్నారు.ఇది కూడా చదవండి: కేటీఆర్ మెడకు మరో ఉచ్చు.. రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు సీఎం మారుతారన్న మహేశ్వరరెడ్డి.. నిన్న మీడియాతో చిట్ చేసిన చేసిన బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి తెలంగాణలో సీఎం మారబోతున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం మానేశాడన్నారు. రేవంత్ కు హాలిడే పీరియడ్ అయిపోయిందన్నారు. ఇక ఆయనకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్నారు. 2025 జూన్ నుంచి డిసెంబర్ లోపు ఎప్పుడైనా రాష్ట్రానికి కొత్త సీఎం రావొచ్చని బాంబు పేల్చారు. ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కొత్త సీఎం వేటలో పడిందన్నారు. మూసీ ప్రాజెక్టును రేవంత్ రెడ్డి తన స్వార్థం కోసం వాడుకుంటున్నారని కాంగ్రెస్ హైకమాండ్ భావించిందన్నారు.ఇది కూడా చదవండి: PM Modi vs CM Revanth: ప్రధాని మోదీకి సీఎం రేవంత్ మాస్ కౌంటర్! ఈ విషయంపై మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న ఒరిజినల్ మంత్రులు రేవంత్ పై హై కమాండ్ కు ఫిర్యాదు చేశారన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ మంత్రులకు మూసి ప్రక్షాళన ఇష్టం లేదన్నారు. సీఎం రేవంత్ నిర్ణయాలను సీనియర్ మంత్రులు ఒప్పుకోవడం లేదన్నారు. దీంతో ఈయన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో పొంగులేటి మహేశ్వరరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. సీఎం మార్పు ఉండదని తేల్చి చెప్పారు. దీంతో ఈ సీఎం మార్పు చర్చ ఇంతటితో ఆగుతుందా? మహేశ్వరరెడ్డి మళ్లీ స్పందిస్తారా? అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. #telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి