నిరుద్యోగ యువతకు బంఫర్ ఆఫర్.. విదేశాల్లో భారీ ప్యాకేజ్‌తో ఉద్యోగం హుస్నాబాద్ నిరుద్యోగ యువత ఫారిన్ జాబ్ మేళాకు ఎన్‌రోల్మెంట్ చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. వారికి శిక్షణ ఇచ్చి స్కిల్స్ ఆధారంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. By B Aravind 25 Oct 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి హుస్నాబాద్ నిరుద్యోగ యువత ఫారిన్ జాబ్ మేళాకు ఎన్‌రోల్మెంట్ చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. అభివృద్ధి చెందిన దేశాల్లో భారీ వేతనాలతో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా సచివాలయంలో ఆయన టాంకాం ప్రతినిధులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా హుస్నాబాద్‌లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి వివిధ రంగాల్లో వాళ్లకున్న స్కిల్స్ ఆధారంగా విదేశాల్లో మంచి జీతంతో ఉద్యోగాలు కల్పించేలా జాబ్‌మేళాను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. Also Read: ఫలించిన కానిస్టేబుల్ భార్యల కృషి.. సెలవుల రద్దు నిర్ణయం నిలిపివేత నిరుద్యోగ యువత డేటా సేకరించాలి నవంబర్ మొదటివారంలో జరిగే ఈ జాబ్ మేళా కోసం మండలాల్లో అవగాహన కల్పించాలని మూడూ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిగ్రామంలో ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువత డేటా సేకరించి వారికి ఆసక్తి ఉన్న దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ప్రోత్సహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనలు చేశారు. Also Read: రూ.10 నాణేలు చెల్లుతాయి.. లావాదేవీలకు వాడొచ్చు లక్షల్లో జీతాలు ఇప్పటికే హుస్నాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకి మంచి స్పందన వచ్చిందని దాని ద్వారా 5 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయని తెలిపారు. విదేశాల్లో లక్షల్లో జీతాలు ఉన్న ఉద్యోగాలకు టాంకాం కంపెనీ ద్వారా నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. ఇక్కడి నుంచి మంచి కంపెనీలకు పంపించేందుకు ఈ మెరుగైన అవకాశాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా జర్మనీ,జపాన్ ,కెనడా ,గల్ఫ్ దేశాలు,యూఎస్ఏ, యూకే ,ఇజ్రాయెల్ , న్యూజిలాండ్ దేశాల్లో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉండనున్నాయి. ఇప్పటికే టాంకాం ద్వారా శిక్షణ ఇచ్చి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. #telangana #telugu-news #minister-ponnam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి