ప్రభుత్వ భూముల పరిరక్షణపై మంత్రి పొంగులేటీ కీలక ఆదేశాలు

ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అటవీ, ప్రభుత్వ భూముల సర్వేను చేపట్టి, హద్దులను గుర్తించి, సంరక్షించాలన్నారు.

New Update
ps 2

ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.శుక్రవారం భైంసా పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, రెవెన్యూ,  ఇంజనీరింగ్, మార్కెటింగ్, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజల భూ సమస్యలను వెంటనే పరిశీలించి, పరిష్కరించాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని అటవీ, ప్రభుత్వ భూముల సర్వేను చేపట్టి, హద్దులను గుర్తించి, సంరక్షించాలని తెలిపారు.

Also Read: స్టార్ సింగర్‌కు సీఎం రేవంత్‌ సీరియస్ వార్నింగ్.. లీగల్ నోటీసులు జారీ!

 ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సర్వే నిర్వహించిన వివరాలను రికార్డు రూపంలో సమర్పించాలన్నారు. వరి ధాన్యం, పత్తి పంట కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. రైతులు నష్టపోకుండా పంటల కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సేకరించిన వరి ధాన్యం, పత్తి పంట, రైతుల ఖాతాల్లో జమ చేసిన డబ్బులకు సంబంధించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

పంటలను అమ్మిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను తప్పకుండా కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. సన్న వడ్లపై క్వింటాలుకు రూ.500 రూపాయల బోనస్ అందిస్తున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే పంటను అమ్ముకోవాలని, రైతులెవరూ కూడా దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు జిల్లాలో పంపిణీ చేసిన రెండు పడక గదుల ఇళ్లు, పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇళ్లకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Also Read: తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి కొత్త ప్లాన్: మంత్రి జూపల్లి

 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి నిర్వహణ తీరు గురించి ఆరా తీశారు. జిల్లాల్లోని జనాభా, కుటుంబాలు, ఎన్యుమరేషన్ బ్లాకులు, సర్వే నిర్వహిస్తున్న ఎన్యుమరేటర్లకు సంబంధించి వివరాలు అధికారులు మంత్రికి వివరించారు. సర్వే లక్ష్యాలను ప్రజలకు అర్థమయ్యేటట్లు వివరించి సర్వేలో భాగస్వాములను చేయాలని మంత్రి సూచించారు. ఆ తర్వాత భైంసా పట్టణం సమీపంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులకు సంబంధించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన వారికి ఇళ్లను అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు