స్టార్ సింగర్‌కు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్.. లీగల్ నోటీసులు జారీ! హైదరాబాద్ వేదికగా కాన్సర్ట్ నిర్వహించనున్న పంజాబీ సింగర్ దిల్‌జీత్ దోసాంజ్‌కి తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. ‘దిల్ లుమినాటి’ కాన్సర్ట్ లో డ్రగ్స్, ఆల్కహాల్ కల్చర్‌ను ప్రమోట్ చేసే పాటలను పాడొద్దంటూ లీగల్ నోటీసులు జారీ చేసింది. By srinivas 15 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి Hyderabad: హైదరాబాద్ వేదికగా కాన్సర్ట్ నిర్వహించనున్న పంజాబీ సింగర్ కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. పాటల్లో అభ్యంతరకర విషయాల జోలికి వెళ్లొద్దంటూ సూచించింది. ఆ మేరకు పంజాబీ సింగర్ దిల్‌జీత్ దోసాంజ్‌కి రేవంత్ ప్రభుత్వం లీగల్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం హైదరాబాద్ వేదికగా ‘దిల్ లుమినాటి’ కాన్సర్ట్‌కు అతను హాజరుకానున్నాడు. ఈ మేరకు డ్రగ్స్, ఆల్కహాల్ కల్చర్‌ను ప్రమోట్ చేసే పాటలను పాడొద్దంటూ నోటీసుల్లో ముందుగానే హెచ్చరించింది. హింసను ప్రేరేపించేలా ఉన్నాయంటూ.. ఇటీవల చండీగఢ్‌కు చెందిన పండిట్ రావ్ ధరేనవర్ అనే ప్రొఫెసర్ దిల్ జీత్ పై ఫిర్యాదు చేశాడు. లైవ్ కాన్సెర్టుల్లో ఇలాంటి పాటలను పాడకుండా అతడిపై చర్యలు తీసుకోవాలంటూ సూచించాడు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలెర్టయ్యింది. ఈ మేరకు రంగారెడ్డి డిస్ట్రిక్ వెల్ఫేర్ ఆఫీసర్‌కు ఫిర్యాదుదారు కొన్ని ఆధారాలను కూడా అందించాడు. అతడి పాటలు మద్యం, డ్రగ్స్, హింసను ప్రేరేపించేలా ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశాడు. గత నెల 26,27 తేదీల్లో ఢిల్లీలోని జవహార్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన కాన్సర్ట్ ను సాక్ష్యంగా చూపాడు. అందులోని కొన్ని వీడియో ఎవిడెన్సులను ఫిర్యాదు కాపీతో జతచేశాడు. ‘‘మీ లైవ్ షోలో అభ్యంతరకర విషయాలను నిరోధించడానికి మేం ముందుగానే నోటీసులు జారీ చేస్తున్నాము అదే విధంగా కాన్సర్ట్ సమయంలో పిల్లలను వేదికపైకి తీసుకురావద్దు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దలు 140 డెసిబుల్స్ కంటే ఎక్కువ ప్రెజర్ లెవెల్ ఉన్న శబ్దాలకు గురికాకూడదు. పిల్లలకు సంబంధించి ఈ లెవెల్ 120 డెసిబుల్స్‌కు తగ్గించాల్సి ఉంటుంది. కాబట్టి, మీ లైవ్ షోలో పిల్లలను స్టేజ్‌పైకి తేకూడదు. 13 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను ఈ షోకు అనుమతించరాదు. పెద్ద శబ్దాలు, ఫ్లాష్ లైట్లు పిల్లలకు హానికరం’’ అంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఆయుధ చట్టం కింద కేసు నమోదు.. పంజాబీ సింగర్లు తమ పాటల్లో తరచుగా గన్ కల్చర్ ను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్నారు. 2020లో ఇటీవల హత్యకు గురైన సింగర్ సిద్దూ మూసేవాలా ‘సంజు’ సినిమాలోని ఓ పాటలో తనపై ఆయుధ చట్టం కింద నమోదైన కేసును ప్రస్తావించారు. 2022లో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా హింసను, డ్రగ్స్‌ను ప్రోత్సహించరాదంటూ గాయకులను హెచ్చరించాడు. ఇక శుక్రవారం జరగనున్న ఈ కాన్సర్ట్ కు 20వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉండటంతో సిటీలోని ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. #CM Revanth #singer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి