TG: ఆసుపత్రిలో శిశువు మృతిపై స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ

హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రిలో నర్సుల నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందడంపై వచ్చిన వార్తా కథనాలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు. కమిషనర్ సమర్పించిన నివేదికలో పత్రికలో వచ్చిన వార్త కథనంలోని పలు అంశాలు నిరాధారమైనవిగా పేర్కొన్నారు.

New Update
Damodar rajanarsimha

హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రిలో నర్సుల నిర్లక్ష్యం వల్ల శిశువు మృతి చెందడంపై వచ్చిన వార్తా కథనాలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ  స్పందించారు. వార్త కథనాలపై వైద్య విధాన పరిషత్ కమిషనర్‌ను విచారణకు ఆదేశించారు. దీంతో కమిషనర్ అజయ్‌ కుమార్‌ వెంటనే హుజూర్ నగర్ ఆస్పత్రి సూపరింటేండెట్‌తో విచారణ జరిపి నివేదిక అందించారు. టీవీవీపీ కమిషనర్ సమర్పించిన నివేదికలో పత్రికలో వచ్చిన వార్త కథనంలోని పలు అంశాలు నిరాధారమైనవిగా మంత్రి పేర్కొన్నారు. '' నిరాధారమైన వార్తను నిర్ధారించుకోకుండా సోషల్ మీడియాలో పోస్టు పెట్టి రాజకీయాలు చేయడం మానుకోవాలి. మీ పదేళ్ళ పాలనలో ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేశారు.

Also Read: ఏకలవ్య పాఠశాలను సందర్శించిన బండి సంజయ్‌.. అధికారులపై సీరియస్‌

ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వ సంస్థలపై బురద చల్లుతున్నారు. ప్రజలకు ప్రభుత్వ సంస్థల పట్ల నమ్మకం పోయేలా మీ వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో హుందాగా వ్యవహరించండి. ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు. ప్రజలకు ప్రభుత్వ సంస్థలపై గౌరవం పెరిగేలా మాట్లాడాలి. నిర్మాణాత్మక విమర్శలు చేస్తే స్పందిస్తానని'' మంత్రి అన్నారు. 

Advertisment
తాజా కథనాలు