Job Mela in Telangana: తెలంగాణలో భారీ జాబ్ మేళా.. 70 కంపెనీల్లో 2500+ జాబ్స్.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే!
నిరుద్యోగులకు శుభవార్త. అక్టోబర్ 9న మహబూబాబాద్ లోని న్యూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే శంకర్ నాయక్ తెలిపారు. సూర్య చంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. అక్టోబర్ 9న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఈ జాబ్ మేళా కొనసాగుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ ఉదయం 9గంటల మహబూబాబాద్ న్యూ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు అన్ని ధ్రువపత్రాలతో హాజరు కావాలని తెలిపారు.