TG News: ఠాగూర్ సినిమాను మరిపించే సీన్..హైదరాబాద్‌లో దారుణం హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ మెడికోవర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ నాగప్రియ ఆనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. డబ్బులు కడితేనే డెడ్ బాడీని అప్పగిస్తామంటూ ఆస్పత్రి యాజమాన్యం తేల్చిచెప్పేశారు. దీంతో కన్నీరుమున్నీరుగా కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. By Vijaya Nimma 06 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి TG News: ఠాగూర్ సినిమాలో చిరంజీవి ఆస్పత్రికి మృతదేహాన్ని తీసుకొచ్చి ట్రీట్‌మెంట్ చేయమనే సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో డబ్బు కోసం శవానికైనా చికిత్స చేసి డబ్బులు గుంజుతారు వైద్యులు. అలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. ఆస్పత్రుల్లో దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. హైటెక్ సిటీ మెడికోవర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ నాగప్రియ ఆనారోగ్యంతో చేరింది. అనారోగ్యంతో ఉన్న నాగప్రియ చికిత్స పొందుతూ మృతి చెందింది. చికిత్స కోసం నాగప్రియ కుటుంబ సభ్యులు మూడు లక్షలకుపైగా ఆస్పత్రికి బిల్లు కట్టారు. అంతటితో ఆ ఆస్పత్రి ధనదాహం ఆగలేదు. పేషెంట్ ఒక జూనియర్ డాక్టర్ అని కూడా చూడకుండా మృతదేహం పెట్టుకుని బంధువులతో బేరసారాలకు దిగారు. నాలుగు లక్షలు కట్టి డెడ్‌బాడీని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. Also Read : ఇల్లినాయిస్‌లో భారతీయుడు రాజా కృష్ణమూర్తి విజయం! జూనియర్ డాక్టర్ అని చూడకుండా.. ఇప్పటికే వైద్యం కోసం మూడు లక్షలు చెల్లించామని కుటుంబ సభ్యులు మొరపెట్టుకున్నా ఏ మాత్రం కనికరించలేదు. కర్కశంగా మరో లక్ష పట్టుకొస్తేనే బాడీని అప్పగిస్తామంటూ తేల్చిచెప్పేశారు. దీంతో కన్నీరుమున్నీరుగా నాగప్రియ కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో విషయం చెప్పగా ఆస్పత్రి సిబ్బందితో ఫోన్ చేసి మాట్లాడారు. అయినా యాజమాన్యం వైఖరి మారలేదు. ఎవరు ఏం చెప్పినా డబ్బులు కట్టి నాగప్రియ మృతదేహం తీసుకెళ్లాలంటూ భీష్మించుకుని కూర్చున్నారు. డబ్బుల కోసం కావాలనే వైద్యం ఆపేశారని, అందు వల్లే నాగప్రియ మరణించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా డబ్బులు కట్టేంత వరకు చనిపోయిన విషయం కూడా చెప్పలేదని మండిపడుతున్నారు. దీంతో ఆస్పత్రి దగ్గర ఉత్రిక్తత వాతవారణం నెలకొంది. ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. ఇంత జరుగుతున్నా ఆస్పత్రి సిబ్బంది నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇది కూడా చదవండి: ఫ్రిజ్‌లో ఈ సీక్రెట్ బటన్ ఇలా వాడితే... తాజా ఆహారం మీ సొంతం కొంతకాలంగా కార్పొరేట్ ఆస్పత్రులు ధనదాహంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాయి. ఇష్టానుసారం బిల్లు వసూలు చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. వైద్యశాఖ అధికారులు కూడా పట్టిపట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రాణాలపైకి వచ్చినప్పుడు కార్పొరేట్ ఆస్పత్రులకు పరుగెత్తడంతో అదే ఆసరాగా చేసుకుని పేదలను దోచుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇది కూడా చదవండి: మహిళల్లో థైరాయిడ్ క్యాన్సర్‌కు కారణం? Also Read : ప్రముఖ నటి అరెస్టుకు రంగం సిద్ధం..! #medicover-hospital #tg-news #crime మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి