Crime News : పెళ్లయి ఇద్దరు పిల్లలు..యువతీతో వివాహేతర సంబంధం..చివరికి..

ములుగు జిల్లా. మండలం లాలాయగూడ గ్రామంలో జాడి సమ్మయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతన్ని సిమెంట్ స్తంభానికి కట్టేసి కొట్టి  చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మైనర్ బాలికతో వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తెలుస్తోంది.

New Update
FotoJet - 2025-11-17T130716.438

Man murdered for extramarital affair

Crime News : ములుగు జిల్లా. మండలం లాలాయగూడ గ్రామంలో జాడి సమ్మయ్య (40) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతన్ని సిమెంట్ స్తంభానికి కట్టేసి కొట్టి  చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందిన జాడి సమ్మయ్య (40) మండల కేంద్రంలో ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్నాడు. అతనికి వివాహం కాగా భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొద్ది కాలంగా లాలాయగూడెం కు చెందిన మైనర్ బాలిక(16)తో వివాహేతర సంబంధం పెట్టుకుని మద్యానికి బానిస అయ్యారని సమాచారం. గత కొద్ది రోజులుగా ఆ యువతితో  రహస్యంగా ప్రేమ వ్యవహారం సాగిస్తున్నాడు.

 గత కొద్ది రోజుల క్రితం సమ్మయ్య తండ్రి సైతం ఇంట్లో గొడవలు అవుతున్నాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో  నిన్న రాత్రి ఇంట్లో  ఎవరూ లేరు, అందరూ ఊరెళ్ళారని జాడి సమ్మయ్యకు ఫోన్ చేసిన యువతి ఇంటికి రమ్మని చెప్పినట్లు తెలిసింది.సమ్మయ్య ఆదివారం సాయంకాలం టీఎస్ 25 ఏ 7666 నెంబర్ గల హోండా ద్విచక్ర వాహనంపై లాలాయి గూడెం గ్రామానికి రాగా మాటువేసి పట్టుకున్న యువతి బంధువులు...ఆగ్రహంతో సమ్మయ్యను గ్రామంలోని ఒక విద్యుత్ స్తంభానికి కట్టేసి విపరీతంగా కొట్టినట్లు తెలిసింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisment
తాజా కథనాలు