విజయమ్మకు వైసీపీ కౌంటర్!

AP: ఆస్తుల వివాదంపై విజయమ్మ విడుదల చేసిన లేఖకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. విజయమ్మ రాసిన లేఖ జగన్‌ను రాజకీయంగా దెబ్బ తీసేలా ఉందని చెప్పింది. ఎన్నికల సమయంలో జగన్ ను జైల్లో పెట్టిన కాంగ్రెస్ కు విజయమ్మ ఓటు వేయమనడం నిజం కదా? అని ప్రశ్నించింది.

New Update
YS Jagan: లోటస్ పాండ్ కు జగన్.. తల్లి విజయమ్మతో భేటీ!

YSRCP: ఆస్తుల వివాదంపై జగన్‌కు వ్యతిరేకంగా వైఎస్ విజయమ్మ విడుదల చేసిన లేఖకు వైసీపీ కౌంటర్ ఇచ్చింది. విజయమ్మ రాసిన లేఖ జగన్ ను రాజకీయంగా దెబ్బ తీసేలా ఉందని చెప్పింది. ఎన్నికల సమయంలో జగన్ ను జైల్లో పెట్టిన కాంగ్రెస్ కు విజయమ్మ ఓటు వేయమనడం నిజం కదా? అని ప్రశ్నించింది.

వైసీపీ లేఖలో....

"1. విజయమ్మ రాసిన లేఖలో,  జగనారిని లీగల్గా గా ఇబ్బందిపెట్టేందుకు, తద్వారా బెయిల్ రద్దుకు జరిగిన కుట్ర వ్యవహారాన్ని కనీసం ప్రస్తావించకపోవడం ప్రజలను పక్కదోవపట్టించడమే. సరస్వతీ కంపెనీ విషయంలో ఈడీ అటాచ్మెంట్ ఉన్నప్పటికీ, తెలంగాణ హైకోర్టు స్టేటస్-కో ఆదేశాలు ఉన్నప్పటికీ, యాజమాన్యబదిలీ జరిగేలా క్రయవిక్రయాలు చేయకూడదని, అందుకే అటాచ్మెంట్లో ఉందనే విషయం అందరికీ తెలిసినప్పటికీ, సరస్వతీ విషయంలో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయవద్దని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిల సహా న్యాయసలహాలు ఉన్నప్పటికీ, తప్పు అని తెలిసినప్పటికీ మోసపూరితంగా, కుట్రపూరితంగా షేర్లు బదిలీచేసిన మాట వాస్తమే కదా? షర్మిలగారి భావోద్వేగాలకు, ఒత్తిళ్లకు గురై జగన్ న్యాయపరంగా, చట్టపరంగా చిక్కులు తెచ్చే ఈ పనికి, తెలిసి కూడా విజయమ్మగారు ఆమోదించి సంతకం పెట్టడం నిజమేకదా? విజయమ్మ లేఖలో ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించడం ప్రజలను, వైయస్సార్ రి అభిమానులను పక్కదోవపట్టించడమే కదా?

2. 2024 ఎన్నికల్లో జగన్ ఒక్కరే ఒకవైపున ఉంటే, అటువైపు చంద్రబాబు నేతృత్వంలో రాజకీయ ప్రత్యర్థులు జట్టుకడితే, మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా, దివంగత మహానేత వైయస్సార్ ని ఎఫ్ఐఆర్ లో పెట్టిన తన కుమారుడ్ని అన్యాయంగా 16నెలలు జైల్లోపెట్టిన కాంగ్రెస్ కు  ఓటు వేయండంటూ, వైయస్సార్సీపీని ఇబ్బందిపడుతూ వీడియో విడుదలచేసి విజయమ్మ షర్మిల వైపు ఉన్నారనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. దివంగత మహానేత, వైఎస్సార్ రాజకీయ ప్రత్యర్థులకు, వైయస్సార్ కుటుంబంపై నిరంతరం కుట్రలు పన్నే చంద్రబాబుకు రాజకీయంగా మేలుచేసే ఇలా వ్యవహరించడం ధర్మమేనా? రాజకీయాలు పక్కనపెడితే ఒక తల్లిగా ఆరోజు విజయమ్మ మద్దతు సంగతి దేవుడెరుగు, కనీసం తటస్థవైఖరిని మరిచిపోయి, పక్షపాతం వహించిన వైనంచూసి వైయస్సార్ అభిమానులు తీవ్రంగా కలతచెందారు, బాధపడ్డారు.'  అని లేఖలో ప్రస్తావించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు