Viral News: మద్యం మత్తులో ప్రిన్సిపల్.. విద్యార్థులు ఏం చేశారో తెలిస్తే షాకే!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం జీపీపల్లి గ్రామంలో విచిత్ర ఘటన జరిగింది. మద్యం సేవించి స్కూల్‌కు వచ్చిన ప్రిన్సిపల్‌ను విద్యార్థులు నిర్భందించారు. ప్రిన్సిపల్ నిర్వాకంపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు కంప్లైంట్ అందింది. ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.