నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ తెలిపారు. ఇటీవల పోకలమ్మ వాగు దగ్గర జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మావోయిస్టులు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు.
ఇది కూడా చూడండి: నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
భోజనంలో మత్తు ఇచ్చి..
నవంబర్ 30వ తేదీన చెల్పాక పంచాయతీలోని ఓ వ్యక్తికి భోజనాలు ఏర్పాటు చేయమని దళం చెప్పింది. దీంతో ఆ వ్యక్తి పోలీసులకు సపోర్ట్‌గా మారి ఆహారంలో మత్తు ఇచ్చారు. దీంతో దళం సభ్యులు అందరూ కూడా స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత రోజు ఉదయం గ్రేహౌండ్స్ పోలీసులు ఏడుగురు సాయుధులను అధీనంలోకి తీసుకున్ని, కాల్చి చంపారని జగన్ ఆరోపించారు.
ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తుల కోసం 34 ప్రత్యేక రైళ్లు..ఏ రూట్లో ఆగుతాయో తెలుసా
ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. ఘటనపై న్యాయ విచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్లకు అత్యంత విశ్వాసంగా కొమ్ముకాస్తుంది. వారి లాభాల కోసమే దోపీడీ విధానాలను అమలు చేస్తున్నది. అయితే రాష్ట్రంలోని అన్నిస్కూళ్లకు ఈ రోజు సెలవు ఇవ్వలేదు. కేవలం మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే బంద్ ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఏరియాల్లోని స్కూళ్లు, కాలేజీలకు మాత్రమే సెలవులు ఇచ్చారు. హైదరాబాద్‌లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వలేదు.
ఇది కూడా చూడండి: Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. డిసెంబర్ 15 వరకూ వానలే..వానలు!
అందులో భాగంగానే ప్రజా వ్యతిరేక విధానాలకు అడ్డంకిగా మారిన ప్రజా ఉద్యమాలను అణిచివేయడానికి ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీని, పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ కగార్‌ను సాగిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Asad: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్!