మాలలు సైకోలు, స్వార్థపరులు.. అంబేడ్కర్ ను అవమానించారు: మందకృష్ణ

ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటున్న మాలలు సైకోలు, స్వార్థపరులని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా అన్నారు. మాలల సభలో అంబేడ్కర్ ను అవమానించారని మండిపడ్డారు. వివేక్ మాలలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

author-image
By srinivas
New Update
Manda Krishna Madiga: వెంటనే వర్గీకరణ అమల్లోకి.. ఉద్యోగ నోటిఫికేషన్లన్నీ మార్చాలన్న మందకృష్ణ!

Manda krishna: ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటున్న మాలలు సైకోలు, స్వార్థపరులని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా అన్నారు. మాలల సభలో అంబేడ్కర్ ను అవమానించారని మండిపడ్డారు. వివేక్ మాలలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

అంబేద్కర్ స్ఫూర్తికి విరుద్ధం..  

ఈ మేరకు ఆదివారం జరిగిన మాల మహాసభను ఉద్దేశిస్తూ మాట్లాడిన మందకృష్ణ.. SC వర్గీకరణకు ఇంకా అడ్డుపడతామని అంటున్న వారికి సమాజంలో ఎవ్వరి మద్దతు లేదన్నారు. అంబేద్కర్ సామాజిక న్యాయ సూత్రాన్ని ముందుకు నడిపేది మాదిగలే అన్నారు. వర్గీకరణకు అడ్డుపడుతున్న వారు మాలలలో ఉన్న కొంత మంది స్వార్థ పరులేనని చెప్పారు. అంబేద్కర్ సామజిక న్యాయ పోరాట రధాన్ని మాలలు అడ్డుకొంటున్నారని, దళితుల్లో ఉన్న మాదిగల హక్కులను మాలల హరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ దళితుల కోసం ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు ఒక్క మాలల కోసమే కాదన్నారు. మాదిగలను చదువుకోని వారు అంటున్నారు. ఇది మాలలకు తగదు. నిన్న మాలల సభలో అంబేద్కర్ ను అవమానించారని విమర్శించారు. 

వివేక్ మాలలను తప్పు దోవ పట్టిస్తున్నారు..

మా జనాభాకు తగ్గట్టు వాటా అడుగుతున్నాం. ఏ వర్గం వారికైనా జనాభాకు తగ్గట్టు ప్రాతినిద్యం ఉండాలి. అంబేద్కర్ స్ఫూర్తి ని మాలల అడ్డుకుంటున్నారు. మా జనాభాకు తగ్గట్టు వాటా అడుగుతున్నాం. SC వర్గీకరణను ఏ పార్టీ దైర్యంగా వ్యతిరేకించడం లేదు. వర్గీకరణకు వ్యతిరేకించే వారు రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి. SC వర్గీకరణకు అన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నాయి. కాంగ్రెస్ కూడా SC వర్గీకరణ అనుకులంగా ఉంది. ఇప్పుడు ఆ పార్టీలో వివేక్ ఏ స్థానం. SC వర్గీకరణను వ్యతిరేకంచే వారు కొత్త పార్టీ పెట్టుకొండి. వివేక్ మాలలను తప్పు దోవ పట్టిస్తున్నారు. మాదిగల హక్కులను మాలలు హరిస్తున్నారని మాలల మీటింగ్ కు ఏ పార్టీ నాయకులు రావడం లేదని చెప్పారు. 

ఇది కూడా చదవండి: బాలీవుడ్ లో 'పుష్ప'మేనియా.. ప్రీ సేల్స్ బుకింగ్స్ లో నయా రికార్డ్

అడ్డుకునే వాళ్ళని ఒడిస్తాం..

దేశంలో అన్ని రాష్ట్రలు SC వర్గీకరణను అమలు చేస్తున్నాయని చెప్పారు. SC వర్గీకరణను ఎవ్వరు అడ్డుకోలేరని, మాలలది తొండి ఆట అన్నారు. మీరు పదవుల కోసం పార్టీలు మారారు. మేము మా జాతి ఆశయం.. SC వర్గీకరణ కోసం దేశంలోని అన్ని పార్టీల ప్రముఖులను కలిశాను. SC వర్గీకరణను అడ్డుకునే వాళ్ళని ఒడిస్తాం. రాజకీయం లేకుండా చేస్తాం. SC వర్గీకరణను వ్యతిరేకించే వారిని మాదిగలు శత్రువులుగా చూస్తాం. ఆరు నూరైనా SC వర్గీకరణ ఆగదు. SC వర్గీకరణ వద్దు అంటే మాలల మీటింగ్ లో మాదిగలు కూడా ఉండాలి కదా అని ప్రశ్నించారు. 

ఇది కూడా చదవండి: దేశంలో నల్లధనం పెరుగుతోంది.. అంబానీ, అదానీకే అడ్డగోలు మాఫీలు!

Also Read: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం

Also Read: యూపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు