/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/mallareddy-jpg.webp)
మాజీ మంత్రి మల్లారెడ్డికి ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. మల్లారెడ్డికి చెందిన మెడికల్ కాలేజీ ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. పీజీ మెడికల్ సీట్ల అడ్మిషన్స్ విషయంలో మల్లారెడ్డి కాలేజీలో అక్రమాలు జరిగాయని ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. మెడికల్ కాలేజీకి చెందిన నాలుగున్నర కోట్ల ఆస్తులను ఈడీ సీజ్ చేయడంతో పాటు మల్లారెడ్డి మెడికల్ కాలేజీపై మనీలాండరింగ్ కింద కేసు కూడా నమోదు చేశారు.
ఇది కూడా చూడండి: రైతు బంధు బంద్.. హరీష్ రావు ఫైర్!
మెడికల్ సీట్ విషయంలో అవకతవకలు జరిగాయని..
మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో మేనేజ్‌మెంట్ కోటాలో సీట్లు అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ ఆస్తులను జప్తు చేసింది. అయితే కేవలం మల్లారెడ్డి మెడికల్ కాలేజీకి సంబంధించిన ఆస్తులను మాత్రమే ఈడీ జప్తు చేయకుండా.. మరికొన్ని మెడికల్ కాలేజీకి చెందిన ఆస్తులను కూడా జప్తు చేసింది. చల్మెడ ఆనందరావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రూ.3.33 కోట్లను, ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీకి చెందిన రూ.2 కోట్లను కూడా ఈడీ సీజ్ చేసింది.
ఇది కూడా చూడండి: బిగ్ ట్విస్ట్ ! పృథ్వీ, నబీల్ ఎలిమినేటెడ్.. టాప్ 5 వీళ్ళే
మెడికల్ సీట్లను బ్లాక్ చేసి ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించారని కాళోజీ నారాయణరావు వర్సిటీ రిజస్ట్రార్ ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. మనీలాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేసింది. గతేడాది మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, ఆఫీసులపై కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలోనే అవకతవకలు ఉన్నట్లు గుర్తించి కాలేజీకి సంబంధించిన ఆస్తులను సీజ్ చేసింది.
ఇది కూడా చూడండి: నాగ చైతన్య - శోభిత మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా?
నీట్‌లో ఎక్కువ ర్యాంకు పొందిన అభ్యర్థుల కోసం సీట్లు ఫుల్ అయ్యాయాని, ఉత్తరాది వారు ఉన్నారని కొన్ని సీట్లను బ్లాక్ చేస్తున్నారు. అన్ని దశలు కౌన్సిలింగ్ అయిన కూడా చివరి వరకు అలాగే ఉంచేస్తున్నారు. ఆ తర్వాత వీటిని మేనేజ్‌మెంట్ కోటాలో ఎక్కువ మొత్తానికి విక్రయిస్తున్నారట.
ఇది కూడా చూడండి: చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. ఎందుకో తెలుసా ?