హైదరాబాద్‌లోని మల్లారెడ్డి హాస్పిటల్‌లో మృతదేహానికి ట్రీట్‌మెంట్ చేశారన్న విషయం తెలుసుకొని కవరేజీకి వెళ్లిన RTV ప్రతినిధులపై ఆస్పత్రి యాజమాన్యం దౌర్జన్యానికి దిగింది. రిపోర్టర్ ఫోన్ గుంజుకొని పిడిగద్దులు వేశారు. కెమెరాను లాక్కున్నారు. మరోవైపు మృతదేహానికి ట్రీట్‌మెంట్ చేశారని బంధువులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వార్త కవర్ చేయడానికి వెళ్లిన RTV రిపోర్టర్‌పై దాడి జరగడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్ కూడా వైరలవుతున్నాయి.
Also Read: తెలంగాణలో మొత్తం 243 కులాలు.. ఏ కేటగిరీలో ఎన్ని కులాలంటే ?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 4వ తేదీన కిడ్నీలో రాళ్లు వచ్చాయని మాధవి అనే మహిళ హాస్పిటల్ లో చేరింది. అయితే ఆమెకు చేసిన సర్జరీ ఫెయిల్ అయ్యింది. దీంతో ఆ మహిళ మృతి చెందిందని బంధువులు చెబుతున్నారు. కానీ వైద్యులు డబ్బుల కోసం మృతదేహానికి కూడా ట్రీట్‌మెంట్ చేసినట్లు నటించారని ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ ఫెయిల్ అయిన విషయాన్ని తమకు చెప్పకుండా దాచారని.. వెంటలేటర్ పై ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నామని నమ్మించారని వాపోతున్నారు.
Also Read: డెడ్‌బాడీకి ట్రీట్‌మెంట్... మల్లారెడ్డి ఆస్పత్రిలో ఠాగూర్ సీన్ రిపీట్!
జూనియర్ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే సర్జరీ ఫెయిల్ అయిందని బంధువుల ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచి హాస్పిటల్ దగ్గరే ధర్నా చేస్తున్నారు. ఆసుపత్రిని సీజ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మృతురాలు మాధవికి ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగానే మధవి మృతి చెందిందని.. ఆ ఇద్దరు చిన్నారులు అనాథలు అయ్యారని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (DMHO) విభాగం విచారణ జరుపుతోంది.