తెలంగాణలో మొత్తం 243 కులాలు.. ఏ కేటగిరీలో ఎన్ని కులాలంటే ? తెలంగాణలో సమగ్ర ఇంటింటి సర్వే కొనసాగుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే కోసం మొత్తం 243 కులాలను గుర్తించింది. వీటన్నింటికీ కోడ్స్‌ను కూడా కేటాయించింది. ఎస్సీలో 59 కులాలు, ఎస్టీ 32, బీసీ ఏ,బీ,సీ,డీ,ఈబీసీ 134, అలాగే ఓసీలో 18 కులాలు ఉన్నాయి. By B Aravind 09 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి తెలంగాణలో సమగ్ర ఇంటింటి సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి దశలో ఇళ్లకు స్టిక్కర్లు అతికించే పనులు పూర్తయ్యాయి. దీంతో శనివారం నుంచి రెండోదశ పనులు ప్రారంభమయ్యాయి. ఇక నుంచి అధికారులు ప్రతీ ఇంటికి వెళ్లి వ్యక్తిగత, ఫ్యామిలి వివరాలు సేకరిస్తారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్వే కోసం మొత్తం 243 కులాలను గుర్తించింది. వీటన్నింటికీ కోడ్స్‌ను కూడా కేటాయించింది. అధికారులు తమ ప్రశ్నపత్రంలో ఆయా కుటుంబాల కులానికి సంబంధించిన కోడ్ కేటాయించాల్సి ఉంటుంది. Also Read: డెడ్‌బాడీకి ట్రీట్‌మెంట్... మల్లారెడ్డి ఆస్పత్రిలో ఠాగూర్ సీన్ రిపీట్! ఎస్సీ కేటగిరిలో 59 కులాలు ఉండగా, ఎస్టీ కేటగిరిలో 32 కులాలు ఉన్నాయి. బీసీ కేటగిరిలో ఏ,బీ,సీ,డీ, ఈబీసీ కలిపి మొత్తం 134 కులాలు ఉన్నాయి. ఇక ఓసీలో 18 కులాలు ఉన్నాయి. అయితే ఓసీ కేటగిరీలో బుద్ధిస్టులను, జైన్లలను కూడా చేర్చారు. అలాగే మతపరమైన కేటిగిరిలో కూడా బుద్ధిస్టు, జైన్లకు వేరువేరు కోడ్‌లను ఇచ్చారు. అలాగే ఎస్సీ కేటగిరీ నుంచి క్రైస్తవులుగా మారిపోయిన వాళ్లని బీసీ 'సీ' లుగా వర్గీకరించారు. నిరాశ్రయుల వారసులు, అనాథలను బీసీ ఏ కేటగిరీ కిందకు చేర్చారు. బీహార్, ఏపీ తర్వాత కులగణన చేపట్టిన మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. Also Read: గ్రూప్-4 అభ్యర్థులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ఈ నెల 14 నుంచి.. ఇదిలాఉండగా దేశంలో కులగణన జరగాలని కాంగ్రెస్ ఎప్పటినుంచో వాదిస్తోంది. విపక్ష నేత రాహుల్ గాంధీ కూడా కులగణన దేశానికి ఎక్స్‌రే లాంటిదని కూడా చెప్పారు. 50 శాతం వరకే పరిమితి ఉన్న రిజర్వేషన్లను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరోవైపు బీసీలు కూడా తమకు అన్యాయం జరుగుతోందని కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతర వెనుకబడిన కులాలకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అవకాశాలను మెరుగుపరిచేందుకు రేవంత్ ప్రభుత్వం కులగణన పక్రియను చేపట్టింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ సమగ్ర కుటుంబ సర్వేను 60 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. ఇది కూడా చదవండి: BIG BREAKING: బయటకు వచ్చిన కేసీఆర్.. రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు! బీసీ కేటగిలో కులాలు ఇవే బీసీ-ఏ అగ్నికుల క్షత్రియ, వాడబలిజ, గంగపుత్ర, బాల సంతు, బుడబుక్కల, రజక, గంగిరెడ్లవారు, జంగం, జోగి, కాటిపాపల, మేదరి, నాయీ బ్రాహ్మణ వంటి కుల వృత్తుల వారుఅనాథ పిల్లలు, కొన్ని ప్రాంతాలకే వెనుకబడిన తరగతులుగా పరిమితమైన కులాలు బీసీ -బీ వృత్తిపరమైన సమూహాలు, ఆర్య క్షత్రియ, చిత్తారి, గినియార్, చిత్రకార, నఖాస్, దేవాంగ, గౌడ, దూదేకుల, శాలివాహన, పెరిక, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ కులాలు బీసీ - సీ క్రైస్తవమతంలోకి మారిన ఎస్సీలు, ఇతర కులాల వారు బీసీ -డీ ఆరెకటిక, కటిక, మెర, హట్కర్, సూర్యబలిజ, కృష్ణ బలిజ, ముదిరాజ్, ముత్తరాశి, మున్నురు కాపు, లక్కమారికాపు, ఉప్పర, యాదవ, వీరశైవలింగాయత్ మొదలగు కులాలు బీసీ -ఈసామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన ముస్లిం కులాలు , అచ్చుకట్టలవాండ్లు, అత్తర్‌సాయెబులు, ధోబీ ముస్లిం, తురకచాకల, ముస్లిం రజక, ఫఖీర్, ఘంటా ఫకీర్లు, బుడబుక్కి, దర్వేష్, ఫకీర్, గారడీ ముస్లిం, గోసంగి ముస్లిం, హజ్జాం, నాయి ముస్లిం, ఖురేషి, షేక్ కులాలు ఇది కూడా చదవండి: కేటీఆర్ అరెస్టును ఆపుతున్నది ఆయనే.. ఆ ఒక్కరు ఓకే అంటే జైలుకే..? #Samagra Kutumba Survey #telangana #telugu-news #house-survey మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి