/rtv/media/media_files/2025/10/21/jubilee-hills-by-election-2025-10-21-08-54-53.jpg)
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు నేటితో (అక్టోబర్ 21) ముగియనుంది.ఈ కీలకమైన ఉప ఎన్నిక కోసం ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తమ నామపత్రాలను దాఖలు చేసేందుకు ఈరోజు చివరి అవకాశం ఉంది.గత కొద్ది రోజులుగా ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తుండగా, ఈ చివరి రోజున కూడా మరికొందరు ముఖ్య అభ్యర్థులు, ముఖ్యంగా ప్రత్యామ్నాయంగా మరికొన్ని సెట్ల నామపత్రాలను దాఖలు చేయనున్నట్లు సమాచారం.
నేటితో ముగియనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు
— Telugu Scribe (@TeluguScribe) October 21, 2025
ఈ నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
నవంబర్ 11న పోలింగ్.. నవంబర్ 14న కౌంటింగ్ pic.twitter.com/C765IaLNbA
చివరి రోజు కావడంతో నామినేషన్ల కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు అదనపు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రతను కూడా పెంచారు. ఇవాళ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి నామినేషన్ వేయనున్నారు. యూసుఫ్‌గూడ నుంచి ర్యాలీగా వెళ్లనున్నారు దీపక్‌రెడ్డి.ఈ ర్యాలీలో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి,బండిసంజయ్ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు తదితరులు పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు నామినేషన్ ర్యాలీ ప్రారంభంకానుంది.
Also Read : K Ramp Collections: 'కె-ర్యాంప్' కలెక్షన్స్..! అప్పుడే బ్రేక్ ఇవెన్ అయిపోయిందా..?
ఇప్పటి వరకు 127 నామినేషన్లు
అక్టోబర్ 22న నామినేషన్ పత్రాలను పరిశీలన (స్క్రూటినీ) చేస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 24 చివరి తేదీ. నవంబర్ 4న పోలింగ్ జరగనుంది. నవంబర్ 7న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటిస్తారు. ఇప్పటి వరకు 127 నామినేషన్లు దాఖలయ్యాయి.
గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. అయితే.. అనారోగ్య కారణాలతో జూన్ 8న ఆయన కన్నుమూశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలన్న లక్ష్యంతో ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే గోపినాథ్ సతీమణి సునీతను ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు.
Follow Us