Lagacharla: మహబూబాబాద్‌లో హైటెన్షన్.. ఎస్పీ క్యాంపుపై దాడి!

మహబూబాబాద్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. లగచర్లలో గిరిజనులపై దాడికి నిరసనగా మహబూబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మహాధర్నా చేపడుతోంది. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఎస్పీ క్యాంపు కార్యాలయంపైకి బీఆర్ఎస్ కార్యకర్తలు వాటర్ బాటిల్లు విసిరారు.

author-image
By srinivas
rerer
New Update

TG News : మహబూబాబాద్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. లగచర్లలో గిరిజనులపై దాడికి నిరసనగా మహబూబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మహాధర్నా చేపడుతోంది. అయితే ఈ ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోగా.. పోలీసుల తీరుకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read :  తెలంగాణలో స్పెషల్ పోలీస్ స్టేషన్లు.. ఇకపై వారికి చుక్కలే!

Also Read :  నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్‌లో వెళ్లారో బుక్కవ్వడం ఖాయం..

ధర్నా నిర్వహించి తీరుతామంటూ..

ఎస్పీ క్యాంపు కార్యాలయంపైకి బీఆర్ఎస్ కార్యకర్తలు వాటర్ బాటిల్లు విసిరారు. అంతటితో ఆగకుండా అడిషనల్ ఎస్పీ చెన్నయ్యతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. అనుమతి లేకున్నా ఇవాళ ధర్నా నిర్వహించి తీరుతామంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు చెబుతున్నారు. మరోవైపు ఈ ధర్నాలో కేటీఆర్ పాల్గొననుండగా ఆందోళన నేపథ్యంలో పర్యటటనను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మహబూబాబాద్‌ జిల్లావ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్​ విధించినట్టు ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ తెలిపారు.

Also Read :  చిట్టి రోబో బడా దొంగతనం.. 12 రోబోట్‌లను కిడ్నాప్‌ చేసి..!

Also Read :  విడాకుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. అందులో భార్యకు హక్కు!

#brs #mahabubabad #lagacharla
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe