KTR Arrest: బిగుస్తున్న ఉచ్చు.. ఏ క్షణమైన కేటీఆర్ అరెస్ట్! లగచర్ల ఘటనలో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో బయటపెట్టిన విషయాల ప్రకారం కేటీఆర్ ఏ క్షణమైన అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో గవర్నర్, ఇతరుల పర్మిషన్ అవసరం లేకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. By srinivas 13 Nov 2024 | నవీకరించబడింది పై 13 Nov 2024 21:19 IST in తెలంగాణ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి Lagacharla: లగచర్ల ఘటనలో కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో బయటపెట్టిన విషయాల ప్రకారం కేటీఆర్ ఏ క్షణమైన అరెస్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కేటీఆర్, బీఆర్ఎస్ ముఖ్యనేతల ఆదేశాలతోనే దాడికి వ్యూహరచన చేసినట్లు నరేందర్ రెడ్డి వెల్లడించారు. అలాగే సురేశ్‌కు తరచూ ఫోన్ చేసినట్లు అంగీకరించిన నరేందర్.. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్ర పన్నినట్లు ఒప్పుకున్నాడు. మరోవైపు ప్రభుత్వ అధికారులపై దాడి చేసిన వారిలో 19 మందికి అసలు భూమే లేదని, కొందరికి ఉన్నా అది భూసేకరణ పరిధిలోకి రాదని వికారాబాద్ జిల్లా మల్టీ జోన్ ఐజీ సత్యనారాయణ తెలిపారు. Also Read : వరుస కుదరని వ్యక్తితో స్వాతి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు! పట్నం రిమాండ్ రిపోర్ట్.. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపెట్టాడు. ముందస్తు ప్లాన్‌తోనే లగచర్లలో కలెక్టర్‌పై దాడికి పాల్పడ్డట్లు తెలిపాడు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే కేటీఆర్, ఇతర బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో రైతులను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టామని చెప్పాడు. అనుచరుడు భోగమోని సురేష్ ద్వారా స్థానికులను ప్రభావితం చేశామని, అధికారులపై దాడులు చేయకపోతే భూములు దక్కవని బెదిరించినట్లు ఒప్పుకున్నాడు. కొందరికి డబ్బులు ఇచ్చి దాడికి ఉసిగొల్పినట్లు అంగీకరించాడు. అధికారులను చంపినా పర్వాలేదని, రైతులను రెచ్చగొట్టినట్లు సంచలన విషయాలు వెల్లడించాడు. Also Read : ప్లీజ్ మా దేశానికి రండి.. భారత్ ఆటగాళ్లకు పాక్ కెప్టెన్ రిక్వెస్ట్! అరెస్టుకు డేట్ ఫిక్స్.. మరోవైపు ఈ ఫార్మాలా రేస్ లో కేటీఆర్ అరెస్టుకు డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. గవర్నర్ అనుమతి రాగానే కేటీఆర్ అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కేటీఆర్ అరెస్టుపై అమిత్ షాతో చర్చించేందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇవాళ ఢిల్లీకి వెళ్లరనే ప్రచారంతో ఉత్కంఠ నెలకొంది. పీసీ యాక్ట్ 17ఏ కింద కేటీఆర్ ను విచారించేందుకు అనుమతించాలంటూ ఇప్పటికే ప్రభుత్వం గవర్నర్ ను కోరగా.. దీనిపై అటార్నీ జనరల్ అభిప్రాయం కోరారు గవర్నర్ జిష్ను దేవ్. ఈ నేపథ్యంలోనే మరో రెండు వారాల్లో కేటీఆర్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. Also Read : త్వరలో ముగియనున్న ధరణి కథ.. రేవంత్ సర్కార్ కొత్త వ్యూహం ఇదే! Also Read : లగచర్ల నిర్వాసితులకు భట్టి గుడ్ న్యూస్..! #lagacharla #ktr #Patnam Narender Reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి