తెలంగాణలో గత కొద్ది రోజులుగా లేడీ అఘోరీ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తాను సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తానని తెలిపింది. ఇందులో భాగంగానే తాను ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటించింది. ఆత్మార్పణ సమయంలో తాను చనిపోతే శివయ్య వద్దకు వెళ్లిపోతానని.. బతికుంటే సనాతన ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని తెలిపింది.
Also Read: నవంబర్ లో బ్యాంకులకు 12 రోజులు సెలవులు!
ఈ మేరకు అక్టోబర్ 31న సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంలో ఆత్మార్పణ చేసుకుంటానని తెలిపింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు హైదరాబాద్‌కు వెళ్తుండగా అర్ధరాత్రి సిద్ధిపేటలో అఘోరీని అదుపులోకి తీసుకుని తన స్వగ్రామమైన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుషన్‌పల్లికి తీసుకెళ్లారు. అక్కడ తన తల్లిదండ్రుల వద్దకు చేర్చారు.
Also Read: కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...30 మంది!
100 మంది పోలీసులతో భారీ భద్రత
తనను ఆత్మార్పణ చేసుకోకుండా అడ్డుకున్నందుకు అఘోరీ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు అఘోరీని తన సొంత ఊరిలోని ఇంట్లో నిర్భందించారు. దీంతో అఘోరీ ఇంటివద్ద హైటెన్షన్ చోటు చేసుకుంది. దాదాపు 100 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అఘోరీని చూసేందుకు వేలాదిగా జనం తరలి రావడంతో పోలసులు భారీగా భద్రత కట్టుదిట్టం చేశారు.
అఘోరీ బయటకు రాకుండా పోలీసుల చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా అఘోరీని కలిసేందుకు పోలీసులు ఎవరికీ అనుమతివ్వ లేదు. ఇక ఆత్మార్పణకు సమయం ముగిసింది. దీంతో అఘోరీ తర్వాత ఏం చేస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో వార్త నెట్టింట వైరల్ అయింది.
Also read: లెబనాన్ పై విరుచుకుపడిన ఇజ్రాయెల్...కూలిన భారీ భవనాలు!
సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ ఫొటోని షేర్ చేశారు. ఒకప్పుడు అఘోరాగా ఉండి.. ఇప్పుడు అఘోరిగా మారినట్లు ఒక ఫోటో షేర్ చేసి ప్రచారం చేస్తున్నారు. గతంలో గడ్డం, మెడ నిండా రుద్రాక్ష మాలలతో ఉన్న ఫోటో వైరల్ కావడంతో.. ఆ ఫోటో అఘోరికి సంబంధించినదేనా.. లేక ఇంకెవరిదైనానా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
Also Read: తిరుపతిలో దారుణం...మూడున్నరేళ్ల చిన్నారి పై అత్యాచారం..ఆపై చంపి..!
మహారాష్ట్రలో అఘోరీ ప్రత్యక్ష్యం
అయితే తాజాగా పోలీసులు లేడీ అఘోరీని వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆ అఘోరీ తెలంగాణ వదిలి మహారాష్ట్రలో ప్రత్యక్షమైంది. నాగ్‌పూర్ హైవేపై కారులో ప్రయాణిస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నిన్న అర్ధరాత్రి తెలంగాణ పోలీసులు అఘోరీని మహారాష్ట్ర సరిహద్దుల్లో వదిలిపెట్టారు. అఘోరీని రెండు రోజుల హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. తెలంగాణలో ఉంటే ఉద్రిక్త పరిస్థితి ఎదురవుతుందని భావించారు. దీంతో ఆమెను విడిచిపెట్టగా.. మహారాష్ట్ర నుంచి కాశీ వైపు వెళిపోయింది.