కేసు విషయం నేను చూసుకుంటా.. నో టెన్షన్ : కేటీఆర్

కేటీఆర్‌ అరెస్టుపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ మరోసారి మాట్లాడారు. కేసు విషయం తాను చూసుకుంటానని.. కార్యకర్తలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.నాపై పెట్టింది లొట్టపీసు కేసని దాంతో ఏం కాదంటూ పేర్కొన్నారు.

New Update
ktr acb

ktr acb Photograph: (ktr acb)

 ఫార్మలా ఈ- కార్ రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టవుతారా ? లేదా ? అనేదానిపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ మరోసారి స్పందించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసు విషయం తాను చూసుకుంటానని.. కార్యకర్తలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అళాగే ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు చేయలేదని రేవంత్ ప్రభుత్వాన్ని మరోసారి నిలదీశారు. '' నాపై పెట్టింది లొట్టపీసు కేసు. దాంతో ఏం కాదు. ఉద్యమంలో లాఠీ దెబ్బలు తిన్నాం.వాటి ముందు ఇవి చాలా చిన్నవి. 

Also read: అలా చేయడం లైంగిక వేధింపుతో సమానం.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు

రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని చెప్పి రూ.12 వేలే ఇస్తామంటున్నారు. దేవుళ్ల మీద ఒట్టుపెట్టి కూడా రుణమాఫీపై మాట తప్పారు. రుణమాఫీపై సవాల్ చేసినా కూడా వాళ్లు స్పందించలేదు. కేసులు మనకు సమస్య కాదు. ప్రభుత్వాన్ని నిలదీయడమే మన పని. కేసు విషయం నేను చూసుకుంటాను. కార్యకర్తలు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. 

Also Read: ఢిల్లీ ఎలక్షన్స్‌  తర్వాత హిమాలయాలకు పోతా..సీఈసీ రాజీవ్ కుమార్

ఇదిలాఉండగా.. కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. అవుటర్ రింగ్‌రోడ్ టెండర్లో భారీ అవినీతి జరిగిందని చెబుతూ బీసీ పొలిటికల్ జేఏసీ బుధావారం ఫిర్యాదు చేసింది. ఓఆర్‌ఆర్‌లో రూ.7,380 కోట్ల స్కామ్ జరిగిందని.. దీనిపై విచారణ జరిపించాలని కోరింది. ఫార్ములా ఈ రేస్ కేసుతో పాటు ఓఆర్‌ఆర్‌ అక్రమాలపై కూడా దర్యాప్తు జరపాలని చెప్పారు. 

Advertisment
తాజా కథనాలు