Kavitha issue: కవిత గురించి మాట్లాడే ప్రసక్తే లేదు.. KTR ఫస్ట్ రియాక్షన్

బీఆర్ఎస్ పార్టీ కవిత ఇష్యూపై వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మొదటిసారి స్పందించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పార్టీ చర్యలు తీసుకున్నాక కవిత గురించి ఇక మాట్లాడాల్సిన పని లేదని అన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీకి ఎవ్వరైనా ఒక్కటే అని KTR స్పష్టం చేశారు.

New Update
ktr

బీఆర్ఎస్ పార్టీ కవిత ఇష్యూపై వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మొదటిసారి స్పందించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పార్టీ చర్యలు తీసుకున్నాక కవిత గురించి ఇక మాట్లాడాల్సిన పని లేదని అన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీకి ఎవ్వరైనా ఒక్కటే అని KTR స్పష్టం చేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదని కేటీఆర్ అన్నారు. కవితపై ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుందని ఆయన తెలిపారు. కేసీఆర్ నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. గతకొన్ని రోజులుగా కవిత సొంత పార్టీ నాయకులపై సంచలన ఆరోపణనలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. కేటీఆర్ ప్రెస్‌మీట్‌లో కవిత సస్పెన్షన్ పై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. కవిత కామెంట్స్‌పై పార్టీలో చర్చించాల్సింది చర్చించామని.. అందుకు తగ్గ చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇప్పుడు కొత్తగా ఈ అంశంపై కామెంట్ చేసేది ఏమీ లేదని పేర్కొన్నారు. కవిత గురించి కనీసం.. 10 సెకెండ్లు కూడా మాట్లాడలేకపోయారు కేటీఆర్. అటు బీఆర్ఎస్ నాయకులు, ఇటు ప్రతిపక్షాలు సైతం కవిత అంశంపై కేటీఆర్ ఏం మాట్లాడుతారో అని ఆసక్తి చూసినా.. రెండంటే రెండే వ్యాఖ్యలతో కవిత గురించి ముగించేశారు.

చర్లపల్లిలో డ్రగ్స్‌ దందాలో సీఎం రేవంత్ రెడ్డి సంబంధాలు ఉన్నాయని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర పోలీసులు రాష్ట్రంలో వేల కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుంటే ఆ విషయం ముఖ్యమంత్రికి తెలియదా అని కేటీఆర్ ప్రశ్నించారు. అందులో రేవంత్ రెడ్డికి ముడుపులు అందాయని అనుమానం వ్యక్తం చేశారు కేటీఆర్.

Advertisment
తాజా కథనాలు