KTR  : హనుమాన్ పూజలో పాల్గొని.. స్వాములతో కలిసి భోజనం చేసిన కేటీఆర్

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో ప‌ర్యటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో నిర్వహించిన హ‌నుమాన్ దీక్షా స్వాముల‌ పూజ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.

New Update
ktr

ktr

ktrKTR  : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో ప‌ర్యటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో నిర్వహించిన హనుమాన్ పూజ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. సిరిసిల్లలోని తెలంగాణ భ‌వ‌న్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హ‌నుమాన్ దీక్షా స్వాముల‌కు ఏర్పాటు చేసిన భిక్ష కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా నిర్వహించిన హనుమాన్ పూజ‌లో కేటీఆర్ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కేటీఆర్‌కు అర్చకులు వేదాశ్వీర‌చ‌నాలు అందించారు.

Also read :  తండ్రితో మంచు మనోజ్ లొల్లి.. మోహన్ బాబు ఇంటివద్ద హై టెన్షన్!

హనుమాన్ మాలదారులకు భిక్ష ఏర్పాటు చేసి స్వయంగా కేటీఆర్ వడ్డించారు. మాలాదారులు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు చిత్రపటం అందించారు.అనంత‌రం హ‌నుమాన్ దీక్షా స్వాముల‌ను కేటీఆర్ ఆప్యాయంగా ప‌లుక‌రించారు. స్వాముల‌తో క‌లిసి కేటీఆర్ భోజ‌నం చేశారు. కేటీఆర్‌తో స్వాములు ఫొటోలు దిగేందుకు ఆస‌క్తి చూపారు. కేటీఆర్ వెంట సిరిసిల్ల జిల్లా నాయ‌కులు ఉన్నారు.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు