BIG BREAKING: మంచు ఫ్యామిలీ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈరోజు ఉదయం జల్ పల్లిలోని మోహన్ బాబు ఫార్మ్ హౌస్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. అయితే మనోజ్ తండ్రితో మాట్లాడాలని లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేట్ ముందు బైఠాయించి నిరసనకు దిగారు మనోజ్. ఫార్మ్ హౌస్ లోపలికి వెళ్లేందుకు తనకు కోర్టు అనుమతిచ్చిందని వాదించారు. అటు మనోజ్ వస్తున్నారని ముందే సమాచారం అందుకున్న పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా 100మంది పోలీసులతో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. బయట వ్యక్తులు ఎవరూ లోపలికి రాకుండా రెండు కిలోమీటర్ల అవతలే వాహనాలను నిలిపి వేస్తున్నారు.
దొంగతనం కేసు
ఇదిలా ఉంటే నిన్న మనోజ్ అన్న విష్ణు పై దొంగతనం కేసు పెట్టడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. విష్ణు అనుచరులు తన కారుతో పాటు కొన్ని వస్తువులను దొంగలించారని మనోజ్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అలాగే తన నివాసంలో 150 మందితో విధ్వంసం సృష్టించారని, విలువైన వస్తువులను దొంగలించారని తెలిపారు. కాగా, ఈ విషయం గురించి మాట్లాడేందుకు మనోజ్ ఈరోజు మోహన్ బాబు ఫార్మ్ హౌక్ కి వెళ్లినట్లు తెలుస్తోంది.
గతేడాది డిసెంబర్ లో మొదలైన మంచు ఫ్యామిలీ వివాదం కొలిక్కి రావడం లేదు. రోజు రోజుకూ ముదురుతోంది తప్ప.. ముగింపు పలికేలా ఎవరూ వ్యవహరించడం లేదు. హైదరాబాద్ శివారు ప్రాంతం జల్ పల్లిలోని మోహన్ బాబు ఫామ్ హౌస్ ఆస్తుల విషయంలో మనోజ్, విష్ణు వివాదం మొదలైంది. ఈ వివాదం చివరికి ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. మరోవైపు మనోజ్ మాత్రం తన పోరాటం ఆస్తుల కోసం కాదని, మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న తప్పుల గురించి, విద్యార్థులు భవిష్యత్తు గురించి అని వాదిస్తున్నారు.
telugu-news | latest-news | Big Fight Between Manchu Vishnu Vs Manchu Manoj