తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగించేలా కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ లబ్ధి కోసం నిరాధారమైన ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు. తన స్థాయి మరచి దిగజారుడు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై ఫైర్ అయ్యారు.
Also Read : రేషన్ మాఫియాపై ఉక్కుపాదం.. 1010 క్రిమినల్ కేసులు నమోదు!
ఈ మేరకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఇక కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే పరువునష్టం దావా వేస్తానని లీగల్ నోటీసులు పంపించారు. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆ నోటీసులో తెలిపారు. కానీ కొండా సురేఖ ఎప్పటికీ స్పందించకపోవడంతో చెప్పినట్లుగానే మంత్రి కొండా సురేఖపై పరువునష్టం దావా వేశారు.
Also Read : కేటీఆర్ అరెస్టుకు డేట్ ఫిక్స్!
ఆమె వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయని.. పలు మీడియాలో, టీవీ ఛానెల్స్‌లో, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను కోర్టుకు సమర్పించారు. సురేఖ చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ఆమెకు చట్ట ప్రకారం శిక్ష వేయాలని కోర్టును కోరారు. ఇందులో భాగంగానే సత్యవతి రాథోడ్, బాల్క సుమన్, దాసోజు శ్రవణ్, తుల ఉమాలను పిటిషన్ సాక్షులుగా చేర్చారు.
Also Read : హైడ్రాకు షాక్.. కూల్చివేతలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు!
విచారణ వాయిదా
ఈ క్రమంలోనే ఈ కేసు విచారణను ఇటీవల నాంపల్లి ప్రత్యేక కోర్టు నవంబర్ 13కు వాయిదా వేసింది. అనుకున్నట్లుగానే ఇవాళ విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
Also Read : కలెక్టర్ పై దాడి ఎలా చేశారంటే.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు!
కాగా గతంలో మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు చేసింది. నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం అని సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీలో చాలా మందితో కేటీఆర్‌కు ఎఫైర్స్ ఉన్నాయని చెప్పింది. కేటీఆర్ వల్లే నాగ చైతన్య, సమంత విడిపోయారని చెప్పుకొచ్చింది. నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను అడ్డుపెట్టుకుని సమంతన తన దగ్గరకు పంపాలని కేటీఆర్ బ్లాక్ మెయిల్ చేశాడని అన్నారు. ఆ విషయాన్ని నాగార్జున సమంతతో చెప్పగా.. ఆమె ఒప్పుకోలేదని.. అందువల్లనే ఆమె అక్కినేని ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేసిందని చెప్పడంతో హాట్ టాపిక్‌గా మారింది.