అరెస్టైతే హ్యాపీ.. జైల్లో ట్రిమ్ అవుతా.. KTR ఆసక్తికర వ్యాఖ్యలు! కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కేసు పెట్టిన తాను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ అన్నారు. 2 నెలలు జైల్లో ఉండి యోగా చేసి ట్రిమ్ అవుతానన్నారు. ఫార్ములా వన్ తో తాము హైదరాబాద్ ఇజేమ్ పెంచితే.. రేవంత్ ఇజ్జత్ తీస్తున్నాడని మండిపడ్డారు. By srinivas 07 Nov 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి KTR Challenges To CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తిస్తున్నాడని కేటీఆర్ ఆరోపించారు. ఈ రేసింగ్ ప్రయోజనాల గురించి ఈ సన్నాసి ఎవరు చెప్పినా సరే వినటం లేదని, రోజుకో రకంగా ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. ఏం చేసుకుంటావో చేసుకో.. మొత్తం ఏం జరిగిందో నేనే ప్రజలకు చెబుతున్నా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. గురువారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ ను ఖతం చేయాలని రాజ్ భవన్ లో ప్రయత్నం చేశారన్నారు. అయినా సరే తాను దేనికైనా రెడీగా ఉన్నానని, ప్రజల తరఫున పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. Also Read : చిన్నప్పుడు స్టార్ హీరోలకు కూడా ఆ భాదలు తప్పలేదు..! రేవంత్ రెడ్డి గురువు చేయని పనిని మేము చేశాం.. ఈ మేరకు ఈ రేసింగ్ ఇష్యూపై మాట్లాడుతూ.. మొట్ట మొదటి కారు రేస్ 1894 లో పారిస్ లో జరిగింది. ఫార్ములా వన్ రేస్ మొదటి రేసు 1946లో ఇటలీలో జరిగింది. ఫార్ములా వన్ ఎంతో ఫేమస్ అయ్యింది. ఆ రేస్ నిర్వహించేందుకు దేశాలే పోటీ పడతాయి. దేశానికి ఫార్ములా వన్ రేసు రావాలన్న కల ఈనాటిది కాదు. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు కూడా 2003 లో ఎఫ్1 రేసు హైదరాబాద్ లో నిర్వహించాలని ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి గురువు చేయని పనిని మేము చేశాం. అప్పట్లో ఎఫ్ 1 కోసం గోపన్ పల్లిలో 4 వందల ఎకరాల భూమి సేకరించి డెడికేటేడ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించి భూ సేకరణపై కేసులో కోర్టులో నడుస్తోంది. యూపీలో మాయావతి ప్రభుత్వం మొత్తానికి ఎఫ్ 1 రేసును నొయిడాలో జరిపారు. ఎఫ్ 1 రేసు కోసం 2011 లోనే దాదాపు 17 వందల కోట్లు ఖర్చు చేశారని గుర్తు చేశారు. Also Read : డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు షాక్.. తొలగిస్తూ ఉత్తర్వులు కామన్ వెల్త్ గేమ్స్ లో కాంగ్రెస్ భారీ కుంభకోణం.. అలాగే రాజీవ్ గాంధీ హయాంలో 1984 ఏషియన్ గేమ్స్, అదే విధంగా కామన్ వెల్త్ గేమ్స్ కూడా భారత్ లో జరిగాయి. కామన్ వెల్త్ గేమ్స్ కోసం యూపీఏ ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.70 వేల 600 కోట్లు. ఇదే క్రీడల్లో యూపీఏ ప్రభుత్వం మొత్తానికి భారీగా కుంభకోణం చేసింది. ఏ ఇంటర్నేషనల్ ఈవెంట్లు జరిగిన సరే ప్రభుత్వం వాటికోసం ఖర్చు చేస్తోంది. అప్రో ఏషియన్ గేమ్స్ కోసం కూడా రూ.103 కోట్లు ఖర్చు చేశారు. క్రీడల నిర్వహణ కోసం ప్రభుత్వాలు ఖర్చు చేయటమనేది సర్వసాధారణం. తమిళనాడులో కూడా జరిగిన ఫార్ములా 4 అనే రేసు కోసం రూ.42 కోట్లు ఖర్చు చేశారు. ఎఫ్ 1 రేసు జరుగుతుంది కనుకే మొనాకో అనే చిన్న దేశం ప్రపంచం మొత్తానికి తెలిసింది. జమ్ము కశ్మీర్ లో మోటార్ రేసింగ్ జరిగితే అక్కడ కశ్మీర్ ను ప్రమోట్ చేస్తూ మోదీ ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీకి కూడా మోటార్ రేసింగ్ అనే అభిరుచి ఉంది. దాన్ని నేను అభినందిస్తున్నన్నారు కేటీఆర్. రేసింగ్ గొప్ప నగరాల్లోనే జరుగుతోంది.. 'ఎఫ్ 1 రేసు కోసం నేను కూడా ఎంతో ప్రయత్నం చేశాను. కానీ ఇండియాకు వచ్చే ఇంట్రెస్ట్ లేదని వాళ్లు చెప్పారు. భవిష్యత్ తరాలకు సంబంధించి ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను ప్రోత్సహించే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఫార్ములా రేసింగ్ లో కూడా ఎలక్ట్రిక్ వెహికిల్స్ తో చేసే రేసింగ్ ను ఫార్ములా ఈ-రేస్ అంటారు. ఎఫ్ 1 రేసు రాని కారణంగా మేము ఫార్ములా ఈ-రేస్ తెచ్చే ప్రయత్నం చేశాం. ఈ-రేస్ అనేది ప్రపంచంలోని అత్యంత గొప్ప నగరాల్లో జరుగుతోంది. ఈ నగరాల చోట హైదరాబాద్ ను చేర్చాలని మేము ఈ-రేస్ ను ఇక్కడికి తెచ్చే ప్రయత్నం చేశాం. మేము ఈ-రేస్ తెచ్చేందుకు చేసి ప్రయత్నంలో సియోల్, జోహెన్నస్ బర్గ్ ను తలదన్ని మన హైదరాబాద్ కు ఈ-రేస్ ను తెచ్చాం. ఫార్ములా రేసింగ్ ను మేము ఒక రేసింగ్ గా మాత్రమే చూడలేదు. ఎలక్ట్రిక్ కార్లను ప్రమోట్ చేయాలనుకున్నాం. ఎలక్ట్రిక్ వెహికిల్స్ కు మన హైదరాబాద్ ను అడ్డాగా మార్చాలని మేము ఈ-రేస్ ను ఒక అడుగుగా ప్రయత్నం చేశాం' అని చెప్పారు. కేవలం రూ. 40 కోట్లు మాత్రమే ఖర్చుచేశాం.. ఇక గతంలో పెట్టిన జీనోమ్ వ్యాలీ ఇప్పుడు వ్యాక్సిన్ తయారీకి హైదరాబాద్ ను రాజధానిగా చేసిందన్నారు. అదే విధంగా ఈ-రేస్ తో ఎలక్ట్రిక్ వెహికిల్స్ కేంద్రం అంటే హైదరాబాద్ ను గుర్తు చేయాలని మేము అనుకున్నామని కేటీఆర్ చెప్పారు. మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఈ-రేస్ కు సంబంధించిన కమిటీ లో మెంబర్ గా చేశాం. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ పెంచేందుకు మన హైదరాబాద్ ను ఎలక్ట్రిక్ మ్యానుఫాక్చరింగ్ చేద్దామనుకున్నాం. గతంలో బీవైడీ అనే సంస్థ చైనా నుంచి వచ్చేది ఉండే. కానీ చైనాలో గొడవల కారణంగా రాలేదు. మేము ఈ-రేస్ కు కోసం ప్రభుత్వం తరఫున చేసిన ఖర్చు కేవలం రూ. 40 కోట్లు మాత్రమే. కానీ హైదరాబాద్ కు వచ్చిన ప్రయోజనం రూ.7 వందల కోట్లు అని నీల్సన్ అనే సంస్థ కూడా చెప్పింది. అదే కాకుండా అమర్ రాజా బ్యాటరీస్, హ్యుందాయ్ అనే సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. బ్యాటరీ వెహికిల్స్ రీ పర్పస్ చేసే విధంగా జీవో తెచ్చాం. మరో సంస్థ రూ.12 వందల కోట్లు పెట్టుబడులు పెట్టింది. ఫార్ములా ఈ-రేస్, మొబిలిటీ వీక్ అనే కార్యక్రమం ద్వారా దాదాపు రూ. 2, 500 కోట్లు పెట్టుబడులు తెచ్చామని చెప్పారు. ఫార్ములా ఈ-రేస్ ద్వారా వచ్చే ఆదాయం కూడా క్రమంగా పెరుగుతూ ప్రాచుర్యం పెరుగుతోంది. ఈ-రేస్ ను రేస్ గా కాకుండా మొత్తంగా ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ యూనివర్సిటీ టెక్నాలజీని పెంపొందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. గతంలో మేము ఈ-రేస్ ను ప్రమోట్ చేసేందుకు ముంబై వెళితే అక్కడే కేంద్రమంత్రులు ఈ-రేస్ ను హైదరాబాద్ కు మీరు తీసుకెళ్లారని చెప్పారు. ఈ-రేస్ కారణంగా రూ.7 వందల కోట్ల ప్రయోజనంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాం. మొబిలిటీ వీక్ ద్వారా కూడా ఎన్నో సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. మేము నాలుగేళ్లు, త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాం. నిర్వహణ సంస్థ, హెచ్ఎండీఏ, గ్రీన్ కో అనే మూడు సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రభుత్వానికి లాభం వచ్చినప్పటికీ గ్రీన్ కో అనే సంస్థ మాత్రం తమకు లాభం రాలేదని పక్కకు తప్పుకుంది. గ్రీన్ కో అనే సంస్థ లాభం రాలేదని తప్పుకోవటంతో వాళ్లకు నాకు ఇచ్చిన పైసలు ఏముంటాయి? అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: LMV లైసెన్స్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇక గ్రీన్ కో సంస్థ వెళ్లిపోవటంతో ఈ-రేస్ పోకుండా ఉండేందుకు ఆ డబ్బులను మేము ఇద్దామని అర్వింద్ కు చెప్పానని అన్నారు. వాళ్లకు స్పాన్సర్లు దొరకకపోవటంతో ప్రమోటర్ దొరికే వరకు నేనే భరోసా ఉంటానని చెప్పాను. ప్రభుత్వం తరఫున ఆ డబ్బు ఇద్దామని చెప్పాను. హెచ్ఎండీఏకు తెలియకుండా మేము డబ్బులు ఇచ్చామని అంటున్నారు. కానీ హెచ్ఎండీఏ కు పూర్తిగా తెలుసు. ఈ-రేస్ ను మేము ప్రభుత్వం తరఫున కార్యక్రమంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు రూ.55 కోట్లు ఖర్చు చేశాం. అందులో అర్వింద్ కుమార్ తప్పు ఏం లేదు. నేను ఈ మొత్తానికి బాధ్యత తీసుకుంటాను. పురపాలక శాఖలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పురపాలక శాఖలో ఇంటర్నల్ గా డబ్బు అడ్జస్ట్ మెంట్ చేసుకోవచ్చు. హెచ్ఎండీఏ ఇండిపెండెంట్ బోర్డు. దానికి ఛైర్మన్ సీఎం, వైస్ ఛైర్మన్ పురపాలక శాఖ మంత్రి. మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తినకుండా రూ. 55 కోట్లు కట్టమని నేనే అర్వింద్ కుమార్ కు చెప్పాను. దీనికి కేబినెట్ అప్రూవల్ అవసరం లేదు. హెచ్ఎండీఏ స్వతంత్ర బోర్డు. ఈ-రేస్ కారణంగా 49 దేశాల్లో హైదరాబాద్ పేరు తెలిసేలా చేశాం. ఎన్నో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశాం. కూలగొట్టుడు, విధ్వంసం చేయటమే వాళ్లకు తెలిసిన పని. కానీ నిర్మాణం చేయటం వారికి తెలియదన్నారు. అందుకే సీఎంగా ఎన్నికైన వెంటనే ఆ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ రద్దు అంటూ ప్రకటనలు చేశారని మండిపడ్డారు. నా మీద కోపంతో అందులో నాకేదో వచ్చిందనుకొని ఏమీ తెలుసుకోకుండా దాన్ని రద్దు చేశారు. హైదరాబాద్ ఈ-రేస్ ను రద్దు చేయటంతో జాగ్వార్, నిస్సాన్ లాంటి సంస్థల వాళ్లు సిగ్గుచేటు అన్నారు. రేవంత్ రెడ్డి దిక్కుమాలిన నిర్ణయంతో ప్రపంచం ముందు హైదరాబాద్ ఇజ్జత్ పోయింది. మనకు రూ.700 కోట్లు లాస్ వచ్చింది. కొందరు రాస్తున్నారు కేటీఆర్ చుట్టు ఉచ్చు అని.. దీనిలో ఉచ్చు, బొచ్చు అనేది ఏముంది నిజానికి హైదరాబాద్ లో ఈ-రేస్ రాకుండా మన నగరం ఇమేజ్ దెబ్బ తీసినందుకు ఆయనపైనే కేసు పెట్టాలి. ఏసీబీ ఫుల్ ఫామ్ రేవంత్ రెడ్డికి తెలుసా? అవినీతి జరిగితే ఏసీబీ ని వాడాలి. కానీ ఇక్కడ అవినీతి ఏముంది? నాకు వచ్చింది ఏముంది? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినవద్దని నేను ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని రూ. 50 కోట్లు ఖర్చు చేశాను. రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఒలింపిక్స్ నిర్వహిస్తామంటాడు. ఒలింపిక్స్ నిర్వహణకు ఎంత ఖర్చు అవుతదా తెలుసా? నిజానికి కేసు పెట్టాలంటే మేఘా కంపెనీ మీద పెట్టాలె. కృష్ణా రెడ్డి మీద ఏసీబీ మీద కేసు పెట్టే దమ్ముందా రేవంత్ రెడ్డికి అంటూ సవాల్ చేశారు. ఇది కూడా చదవండి: ట్రంప్ రాకతో సీన్ రివర్స్.. పశ్చిమాసియాలో మారిన యుద్ధ వాతావరణం! రాఘవ కంపెనీ, మేఘా కంపెనీలకు కేకులు కేసినట్లు ఇచ్చిన పనులకు సంబంధించి కేసులు పెట్టాలె. రూ. 50 లక్షల బ్యాగుతో దొరికిన రేవంత్ రెడ్డి పై 8 ఏళ్లుగా ఎలాంటి చర్యలు లేవు. మేము బ్రాండ్ ఇమేజ్ ను క్రియేట్ చేస్తే నువ్వు బ్యాడ్ ఇమేజ్ చేస్తున్నావు. విశ్వనగరం ఇమేజ్ లేకుండా చేస్తే పెట్టుబడులు వస్తాయా? కేసు పెడితే పెట్టు. హైదరాబాద్ ను అంతర్జాతీయంగా పేరు తెచ్చినందుకు పెడతావా? లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకా? బెంగళూరు కన్నా ఐటీ ఎగుమతులను పెంచినందుకా? ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించినందుకా? ఎందుకు కేసు పెడతావు. నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసిన మేము నీ హామీలపై పోరాటం చేస్తూనే ఉంటాం. ఇవ్వాళ ఓ పేపర్ లో టార్గెట్ కేటీఆర్ అని రాశారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన హమీలపై కదా వాళ్ల టార్గెట్ ఉండాల్సింది. కేసు పెడితే పెట్టుకో. రెండు నెలలు జైల్లో ఉండి మంచిగా యోగా చేసుకొని ట్రిమ్ గా వస్తా. ఆ తర్వాత పాదయాత్ర చేస్తా. రేవంత్ రెడ్డి కనీసం తెలుసుకో అంటూ తనదైన స్టైల్ లో విమర్శలు చేశారు కేటీఆర్. #CM Revanth #ktr #Formula E Race Scam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి