TG News: కేటీఆర్ అరెస్ట్.. తెలంగాణ రాజకీయమంతా ప్రస్తుతం ఈ టాపిక్ మీదే నడుస్తోంది. గతకొన్ని నెలలుగా కేటీఆర్ అరెస్ట్ వార్తలు వస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్ట్ అవుతాడా.. రూ.55 కోట్లు ఎవరు, ఎవరికి ఇచ్చారు? ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు అనే విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఫార్ములా ఈ-కార్ రేసులో కేటీఆర్‌పై కేసు నమోదుకు ఇప్పటికే గవర్నర్ అనుమతి ఇవ్వగా.. గురువారం కేటీఆర్ ను A1గా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. దీంతో కేసు అరెస్ట్, విచారణ వేగవంతం అయ్యే అవకాశం ఉండగా.. అసలు ఏంటీ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం స్పష్టంగా తెలుసుకుందాం. దేశంలోనే తొలిసారి కార్ రేసింగ్.. ఫిబ్రవరి 11, 2023లో దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు అయిన ఖర్చు కొన్ని కంపెనీలు స్పార్సర్ చేశాయి. ఇదే తరహాలో 2024 ఫ్రిభవరి 10న కూడా ఈ ఫార్ములా రేసింగ్ నిహించాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంది. 2023 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. కొన్ని కారణాల వల్ల ఫార్ములా ఈ కార్ రేస్ రద్దు అయింది. అప్పటికే రెండోసారి ఈ ఫార్ములా రేస్ నిర్వహణకు ఏర్పాటు చేశారు. రేసింగ్ కోసం కంపెనీలు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వమే రూ.200 కోట్ల పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేబినెట్, ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రూ.55 కోట్లు రెండు ఫారెన్ కంపెనీలకు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. HMDA నిధులు రూ.55 కోట్లు.. అప్పటి పట్టణ, పురపాలక శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ HMDA నిధులు రూ.55 కోట్లు కేటీఆర్ ఆదేశాల మేరకు ఫార్ములా ఈ ఆపరేషన్స్, ఏస్ నెక్ట్స్ జెన్ ప్రెవేట్ లిమిటిడ్ కంపెనీలకు ఇచ్చారు. దీనికి మంత్రివర్గ అనుమతి, ఆర్బీఐ అనుమతులు తీసుకోలేదు. ఈ విషయాన్ని కేటీఆర్ ఒప్పుకున్నారు. ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందని తెలంగాణ ప్రభుత్వం సీబీఐ ఎంక్వైరీ కోరింది. ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి.. అనుమతి లేకుండానే హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్‌బీఐ అనుమతి లేకుండా డబ్బులు చెల్లించడంతో ప్రస్తుత పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే అధికారులను విచారించారు. కేటీఆర్ ను విచారించడానికి రాష్ట్ర ప్రభత్వం గవర్నర్ అనుమతి కోరింది. 2024 డిసెంబర్ లో గవర్నర్ అనుమతి లభించింది. దీంతో కేటీఆర్‌ను అరెస్ చేస్తారా? అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చూడండి: BIG BREAKING: భారీగా మోహరిస్తున్న పోలీసులు.. KTR అరెస్ట్ కు రంగం సిద్ధం? డబ్బుల చెల్లింపు, కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్, అర్వింద్ కుమార్, చీఫ్ ఇంజినీర్ పైన ఆరోపణలు ఉన్నాయి. కేటీఆర్ మినహా.. మిగతా అధికారులపై విచారణకు ప్రభుత్వం గతంలోనే అనుమతి ఇచ్చింది. కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్ నుంచి అనుమతి కోరగా.. తాజాగా అనుమతి లభించింది. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ లో అవినీతి విషయంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్‌పై కేసు నమోదు అంశంపై చర్చ సందర్భంగా.. కీలక విషయాలు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కేటీఆర్‌ను అరెస్టు చేస్తే.. రాజకీయంగా నష్టమా.. లాభమా అనే చర్చ జరిగినట్టు సమాచారం. రేస్ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలకు కూడా నోటీసులు పంపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.