/rtv/media/media_files/2025/11/24/kokapet-land-price-2025-11-24-19-06-46.jpg)
Kokapet Land Price Hits Record Rs.137 Crore per Acre
హైదరాబాద్ నగర శివారులోని కోకాపేటలో భూములు మరోసారి రికార్డు ధర పలికాయి. ఎకరం ధర ఏకంగా రూ.137.25 కోట్లు పలికింది. ఆ ప్రాంతంలోని నియోపోలిస్‌లో ఉన్న సర్వే నెంబర్ 17,18లో భూములకు వేలం నిర్వహించారు. అయితే సర్వే నెంబర్ 17లోని ఎకరం భూమి ధర రూ.137.25 కోట్లు పలికింది. HMDA పరిధిలో ఉన్న భూములను వేలం వేసేందుకు ఇటీవల ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.
Also Read: సమయం ఇవ్వండి, లొంగిపోతాం.. మావోయిస్టుల సంచలన లేఖ
తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(TGIIC) ఇటీవల రాయదుర్గంలో వేలం పాట నిర్వహించిన సంగతి తెలిసిందే. అక్కడ 7.67 ఎకరాలను ఓసంస్థ ఏకంగా రూ.1357 కోట్లకు దక్కించుకుంది. ఇక్కడ ఎకరం కనీస ధరను రూ.101 కోట్లు నిర్ణయించారు. అయితే వేలంలో రూ.177 కోట్లకు వెళ్లింది. తాజాగా కోకాపేట నియోపోలిస్‌లో కూడా సర్వే నెంబర్ 17,18లోని భూములను HMDA వేలం వేసింది. ఇందులో ఎకరానికి కనీస ధర రూ.99 కోట్లు నిర్ణయించారు. దీనికి అత్యధికంగా రూ.137.25 కోట్లు పలికింది.
Also Read: ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR అంటే ఏంటీ? రాజకీయ పార్టీల అభ్యంతరాలు దేనికి?
Follow Us