బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ స్వాతిప్రియ ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే విద్యార్థిని స్వాతి ప్రియ మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెది ఆత్మహత్య కాదని ఎవరో చంపేసి సూసైడ్‌గా చిత్రీకరించారంటూ ఆరోపిస్తున్నారు. తమ కూతురి మృతదేహాన్ని చూపించకుండా మార్చురీకి తరలించడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్వాతిప్రియ సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు బయటకొస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి RTV చేతిలో ఎక్స్‌క్లూజివ్ ఆధారాలు ఉన్నాయి!. వాటి ప్రకారం.. స్వాతి ప్రియ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం! అని తెలిసింది. వరుస కుదరని వ్యక్తితో స్వాతి ప్రియ ప్రేమలో పడిందని.. ఆ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెబితే వారు ఆ ప్రేమను అంగీకరించలేదని సమాచారం.
Also Read: త్వరలో ముగియనున్న ధరణి కథ.. రేవంత్ సర్కార్ కొత్త వ్యూహం ఇదే!
దీని కారణంగానే స్వాతి ప్రియ కొంతకాలంగా తల్లిదండ్రులతో మాట్లాడలేదని తెలుస్తోంది. ఇందులో భాగంగానే సూసైడ్‌కు ముందు రెండు రోజులుగా స్వాతిప్రియ ఏడుస్తూనే ఉన్నట్లు సమాచారం. ప్రేమకు అంగీకరించలేదన్న కారణంతోనే స్వాతిప్రియ సూసైడ్! చేసుకుందని తెలిసింది. అయితే స్వాతిప్రియ ఫోన్‌లో సున్నితమైన అంశాలుండటంతో పోలీసులు అందులోని విషయాలు బహిర్గతం చేయలేదని తెలుస్తోంది.
Also Read: లగచర్ల నిర్వాసితులకు భట్టి గుడ్ న్యూస్..!
ఎస్పీ ఏమన్నారంటే?
స్వాతి సూసైడ్ కేసు విషయంలో ప్రాథమిక విచారణలో భాగంగా నిర్మల్ జిల్లా ఎస్పీ సంచలన విషయాలు బయటపెట్టారు. స్వాతి ప్రియది ఆత్మహత్య కాదని.. హత్య అని తల్లిదండ్రులు ఆరోపించారు. దీనిపై RTVతో మాట్లాడిన నిర్మల్ జిల్లా ఎస్పీ క్లారిటీ ఇచ్చారు. రెండు రోజుల నుంచి స్వాతి ఏడుస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించామన్నారు. అయితే ర్యాగింగ్‌కు సూసైడ్‌కు సంబంధం లేదని భావిస్తున్నాం అని తెలిపారు.
Also Read: పోలింగ్ అధికారి చెంప చెల్లుమనిపించిన అభ్యర్థి
సూసైడ్ లెటర్‌లో హ్యాండ్ రైటింగ్ స్వాతిదా, కాదా అనేది తేలాలని చెప్పారు. స్వాతి ప్రియ రాసిన లెటర్‌ను FSCLకు పంపిస్తున్నామన్నారు. మానసికంగా స్వాతిప్రియ ఇబ్బంది పడుతున్నట్లు విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. కొద్ది రోజుల నుంచి స్వాతి ప్రియ బాధపడుతోందని ఫ్రెండ్స్ చెప్పారని పేర్కొన్నారు. స్వాతిప్రియది ఆత్మహత్య అనే భావిస్తున్నామని.. విచారణ తర్వాత వివరాలు తెలుస్తాయన్నారు.