‘ఫార్మా విలేజ్ పేరిట రేవంత్ రియల్ ఎస్టేట్ దందా.. తరలిరండి కామ్రేడ్స్’ లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. నరేందర్ రెడ్డిని పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్టు చేయడం దారుణమని అన్నారు. పోలీసులు రేవంత్ సైన్యంలా పని చేస్తున్నారన్నారు. By Seetha Ram 13 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. కొడంగల్ నియోజకవర్గంలో రైతులకు అండగా ఉన్నందుకు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారని మండిపడ్డారు. పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్టు చేయడం దారుణమని అన్నారు. ఇక పోలీసులు కూడా రేవంత్ రెడ్డి సైన్యంలా పని చేస్తున్నారన్నారు. ఇది కూడా చదవండి: కేటీఆర్ అరెస్టుకు డేట్ ఫిక్స్! రేవంత్ రెడ్డి, అన్న తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నారు అంతేకాకుండా మహబూబ్ నగర్ ఎంపీ డి.కె.అరుణను లగుచర్లకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. ఏ అర్హత లేకున్నా రేవంత్ రెడ్డి, ఆయన అన్న తిరుపతి రెడ్డి కలిసి లగుచర్ల గ్రామం వెళ్లి గ్రామస్థూలను బెదిరిస్తున్నారన్నారు. రైతులను అరెస్టు చేసి కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అల్లుడి కోసం పేదల భూములు గుంజుకుంటున్నారని ఫైర్ అయ్యారు. అధికారులు అతి చేస్తే ఏపీ రాష్ట్రంలో ఏం జరిగిందో చూస్తున్నాం అని తెలిపారు. తెలంగాణలో ఐ.ఏ.ఎ.స్, ఐ.పి.ఎ.స్ అధికారులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. తరలిరండి కామ్రేడ్స్ జాతీయ మానవ హక్కుల సంఘం వద్దకు వెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు దీనిపై స్పందించాలని కోరారు. కమ్యూనిస్ట్ పార్టీలు, బీజేపీ పార్టీ, ఇతర పార్టీలు స్పందించాలని అన్నారు. 11 నెలలుగా రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి సీఎం పదవి తుమ్మితే ఊడిపోతుందన్నారు. ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే రేవంత్ రెడ్డి పదవి ఊడుతుందని తెలిపారు. ఇది కూడా చదవండి: లగచర్లలో మళ్లీ హై టెన్షన్..! ఫార్మా విలేజ్ పేరిట రియల్ ఎస్టేట్ దందా కొడంగల్‌లో రేవంత్ రెడ్డి స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని అన్నారు. అదే సమయంలో అరెస్టు చేసిన 16 మంది రైతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఫార్మా విలేజ్ పేరిట రియల్ ఎస్టేట్ దందా చేయాలని రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు. కాగా తమపై దాడి జరగలేదని జిల్లా కలెక్టర్ చెప్పారని.. మరి ఎందుకు కేసులు పెట్టారని ప్రశ్నించారు. #ktr #Kodangal Attack Issue #Patnam Narender Reddy #lagacharla మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి