/rtv/media/media_files/2025/03/09/O4XvKFNTLtxQzgC7rq1U.jpg)
KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడినా సంచలనమే...మౌనంగా ఉన్నా సంచలనమే...అది ఉద్యమమైనా, ప్రభుత్వ పాలన అయిన ఆయన ఎవరి అంచనాలకు చిక్కరు. ఒకసారి రంగంలోకి కేసీఆర్ దిగాడంటే..పక్కా వ్యూహం.. ముహూర్తం ఫిక్స్ చేసుకునే దిగుతారు. ఇప్పుడు అదే జోష్‌తో గేమ్ స్టార్ట్ చేశారు..కేసీఆర్ కొడితే మైండ్ బ్లాక్ అవుద్ది అనేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ 25వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ క్రమంలో మౌనం వీడిన కేసీఆర్ రెండు సమావేశాలు నిర్వహించారు. తెలంగాణ భవన్‌లోనూ, ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలోనూ నిర్వహించిన సమావేశాల్లో కీలక నాయకులకు కీలక సూచనలు చేశారు. ఇక మొన్నటి ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్న బీఆర్‌ఎస్ ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో మాత్రం పోటీ చేయాలని భావిస్తోంది.
తెలంగాణలో 5 స్థానాలకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. నిజానికి బీఆర్‌ఎస్ కు ఉన్న ఎమ్మెల్యే స్థానాలకు గాను ఒక ఎమ్మెల్సీ మాత్రమే దక్కే అవకాశం ఉంది. ఈ లెక్కన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయితాయి. కానీ బీఆర్ఎస్ రెండో అభ్యర్థిని నిలబెడితే ఎన్నికలు తప్పవు. ఇక్కడే కేసీఆర్ తన మార్క్ పాలిటిక్స్‌కు తెరతీశారు. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిపై కేసీఆర్ కసరత్తు కొలిక్కి వచ్చింది. ఈ రోజు అభ్యర్థి పేరును ప్రకటించనుంది బీఆర్ఎస్. అయితే రెండో అభ్యర్థిపైనా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.పార్టీటికెట్ మీద గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలే టార్గెట్‌గా మాస్టర్ ప్లాన్ వేశారు. వ్యూహాత్మకంగా రెండో అభ్యర్థిని నిలబెట్టాలని చూస్తున్నారు. రెండో అభ్యర్థిని నిలబెడితే బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా పక్కన పెడితే రెండో అభ్యర్థిని పెట్టడమే రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.
Also Read: Rains: రైతులకు షాక్.. ఈ ఏడాది వానలు అంతంత మాత్రమే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే!?
బీఆర్ఎస్‌కు ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఒక ఎమ్మెల్సీ సీటు పక్కాగా వస్తుంది. కానీ రెండో అభ్యర్థిని నిలబెట్టాలంటే పార్టీని వీడిన ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ రెండో అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ మొత్తం 39 సీట్లు గెలుచుకుంది. ఆ తర్వాత కంటోన్మెంట్ బై ఎలక్షన్స్ తో ఆ సీటును కోల్పో యింది. మిగిలిన 38 మందిలో పదిమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం గులాబీ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలున్నారు. ఎమ్మెల్యే కోటా లో ఐదు స్థానాలు భర్తీ కావల్సి ఉంది. ఆ లెక్కన ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 21 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాలి. బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులను గెలిపించు కోవాలంటే మొత్తం 42 ఓట్లు అవసరం. అంటే మరో బీఆర్‌ఎస్ వీడిన వారితో కలిపి 14 ఓట్లు కావాలి. ఒకవేళ ఆ పదిమంది బీఆర్‌ఎస్ కు ఓటేస్తే మరో 4 గురు ఎమ్మెల్యేలు కావాలి.
ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం వర్తింపజేయాలని సుప్రీంకోర్టులో పోరాడుతుంది బీఆర్ఎస్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో అభ్యర్థిని బరిలోకి దింపి ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్నారు కేసీఆర్. పార్టీ మారిన వారిలో కొంతమంది మళ్లీ గులాబీ జెండ వైపు చూస్తున్నారనే వార్తలు వినపడుతున్నాయి. అందులో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ ఇప్పటికే తాను కాంగ్రెస్ పార్టీ కాదని ప్రకటించుకున్నారు. ఆయన బాటలోనే మరో ఎమ్మె్ల్యే గూడెం మహిపాల్ రెడ్డి కూడా బీఆర్‌ఎస్ అనే చెప్పుకుంటున్నారు. వీరే కాక మరికొంతమంది కూడా బీఆర్‌ఎస్ కు ఓటు వేయాలని భావిస్తున్నారు. దీంతో పార్టీ మారిన వారు తమకే ఓటు వేస్తారని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటుంది. రెండో అభ్యర్థిని నిలబెట్టి సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని టెన్షన్ పెట్టాలని చూస్తోంది బీఆర్ఎస్.
Also Read: CM Revanth Reddy : ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి...సోమవారంతో ఎమ్మెల్సీ నామినేషన్లకు ముగింపు