Kavitha : కవిత కొత్త పార్టీ...అక్కడి నుంచే పోటీ ?

తెలంగాణ రాజకీయాలు రోజురోజు హీట్‌ పెంచుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి సస్పెండైన తర్వాత ఎంఎల్‌సీకీ రాజీనామా చేసినప్పటికీ అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. తాజాగా తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా అవతరిస్తుంది అని ఆమె పరోక్షంగా తెలపడంతో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

New Update
kavitha

Kalvakuntla Kavitha

Kavitha:తెలంగాణ రాజకీయాలు రోజురోజు హీట్‌ పెంచుతున్నాయి. ఇపుడు ఎవరిని కదిలించిన జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత గురించే మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండైన తర్వాత ఎంఎల్‌సీకీ రాజీనామా చేసినప్పటికీ అది ఇంకా పెండింగ్‌లోనే ఉంది. తాజాగా ఆమె మరోసారి తన రాజీనామాను ఆమోదించాలని చైర్మన్‌ను కోరారు. కాగా ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా అవతరిస్తుంది అని ఆమె పరోక్షంగా తెలిపారు. ఈ తరుణంలో  మంగళవారం (జనవరి 6) తెలంగాణ జాగృతి రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‎లోని జాగృతి ప్రధాన కార్యాలయంలో కవిత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 23 జాగృతి అనుబంధ సంస్థల నేతలు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కొత్త పార్టీ ఏర్పాటు వంటి అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. 2026 ఫిబ్రవరి 16 లేదా 20వ తేదీన మంచిర్యాలలో భారీ బహిరంగా సభ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. ఇదే సభలో కొత్త పార్టీని ప్రకటించాలని అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.

అదే సమయంలో  కవిత గతంలో టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా పని చేసి ఉన్నందున సింగరేణి కార్మికుల్లో ఆమెకు ఉన్న పట్టు మేరకు మంచిర్యాలలో సభ పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతే కాక ఆమె ఇక్కడి నుంచి పోటీ చేసే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. కవిత టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా పని చేయడంతో ఇక్కడి నుంచి పోటీ చేస్తే  ఆమెకు ఉపయుక్తం‎గా ఉంటుందని సన్నిహితులు, కార్మిక నేతలు సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈ సమావేశానికి కవిత ఇద్దరు కొడుకులు హాజరు కావడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది. తన ఇద్దరు కొడుకులను కవిత ఈ భేటీకి తీసుకు రావడానికి వెనక ఉన్నవ్యూహం ఏంటనే దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వారిని కూడా ఇక మీదట తన రాజకీయ సభలకు తీసుకువెళ్తారని ప్రచారం సాగుతోంది.

Advertisment
తాజా కథనాలు