/rtv/media/media_files/2025/11/14/counting-2025-11-14-08-04-55.jpg)
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియంలో మొదలైంది. లెక్కింపు కోసం 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత EVM లలోని ఓట్ల లెక్కింపు ఉంటుంది. ముందుగా షేక్ పేట్ డివిజన్ ఓట్ల లెక్కింపు జరగనుంది. మొదటి ట్రెండ్‌లు ఉదయం 10 గంటలకల్లా, తుది ఫలితం మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటలకల్లా వెలువడే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు.
స్వల్ప ఆధిక్యం లభించే
చాలావరకు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి స్వల్ప ఆధిక్యం లభించే అవకాశం ఉందని అంచనా వేశాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గెలుపు ఓటముల తేడా కేవలం 3% నుండి 8% ఓట్ల వరకు ఉండే అవకాశం ఉందని, పోరు హోరాహోరీగా ఉంటుందని సర్వేలు సూచించాయి.బీజేపీ మూడవ స్థానంలో నిలిచే అవకాశం ఉందని అంచనా వేశాయి.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాల్లో తానే గెలువబోతున్నానని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులతో మంచి మెజార్టీ వస్తుందని, ఫస్ట్ రౌండ్ నుంచే తనకు మంచి లీడ్ మొదలవుతుందని అన్నారు. టైట్ ఫైట్ అయితే ఉండదన్నారు. దాదాపుగా 45 వేలకు పైగా మెజార్టీ వస్తుందన్నారు నవీన్ యాదవ్. అంతకుముందు ఆయన బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు.
Follow Us