Jeedimetla Mother Killed: ‘నువ్వు వచ్చి మా అమ్మను చంపు.. లేదంటే నీపేరు రాసి’.. జీడిమెట్ల తల్లి హత్యకేసులో షాకింగ్ నిజాలు!

జీడిమెట్ల తల్లి హత్యకేసులో షాకింగ్ నిజాలు బయటకొస్తున్నాయి. మృతురాలు అంజలి కూతురే తన ప్రియుడు శివను బెదిరించి చంపించింది. ‘నువ్వు వచ్చి మా అమ్మను చంపు.. లేదంటే నీ పేరు రాసి నేను ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ ఆ పదో తరగతి బాలిక తన ప్రియుడ్ని బెదిరించింది.

New Update
Jeedimetla mother murder case

Jeedimetla mother murder case

జీడిమెట్ల తల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు బయటకొస్తున్నాయి. కన్న కూతురే ప్రియుడ్ని తన ఇంటికి పిలిచి తల్లిని హత్య చేయించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి తాజాగా మరొక నిజం బయటకొచ్చింది. ‘నువ్వు వచ్చి మా అమ్మను చంపు.. లేదంటే నీ పేరు రాసి నేను ఆత్మహత్య చేసుకుంటా’ అంటూ ఆ పదో తరగతి బాలిక తన ప్రియుడ్ని బెదిరించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

నువ్వు వచ్చి మా అమ్మను చంపు

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తికి చెందిన సట్ల అంజలి (39)కి ఇద్దరు కూతుర్లు. ఆమె తన కూతుళ్లతో కలిసి షాపూర్ నగర్ హెచ్ఎంటీ సొసైటీలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. అందులో పెద్ద కూతురు (15) షాపూర్నగర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్‌లో 10వ తరగతి చదువుతోంది. చిన్న కూతురు 8వ తరగతి అభ్యసిస్తోంది. అయితే పెద్ద కూతురుకి, నల్గొండ జిల్లా కట్టంగూర్‌కు చెందిన శివ (18)కు ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది. 

దాదాపు 8 నెలలుగా వీరి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఓ రోజు ఆ బాలిక తన తల్లికి ఈ విషయాన్ని తెలిపింది. ఆమె తల్లి ఒప్పుకోలేదు. దీంతో బాలిక ఈ నెల 19వ తేదీన శివతో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. అనంతరం తన కూతురు కనిపించడం లేదని.. శివపై అనుమానం ఉందని పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు వారిద్దరి పట్టుకున్నారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం ఆ బాలికను తల్లికి అప్పగించారు. 

Also Read: కాల్పుల విరమణకు బ్రేక్.. ఇజ్రాయెల్‌పై మళ్లీ ఇరాన్ దాడులు

ఆపై ఇంటికి వెళ్లిన తర్వాత తల్లి అంజలి తన కూతురిని హెచ్చరించింది. శివను వదిలేసి బుద్దిగా చదువుకోమని చెప్పింది. కానీ తల్లి మాటలు కూతురు బుర్రకు ఎక్కలేదు. దీంతో తన ప్రేమకు తల్లి అడ్డు వస్తుందని.. ఎలాగైనా ఆమెను హతమార్చాలని కూతురు నిర్ణయించుకుంది. ఇలా తల్లిపై కోపం పెంచుకున్న ఆ కూతురు.. ప్లాన్ వేసింది. తన తల్లిని హైదరాబాద్ వచ్చి చంపాలని తన ప్రియుడు శివను కోరింది. చంపకపోతే అతడి పేరు రాసి ఆత్మహత్య చేసుకుంటానని శివను గట్టిగా బెదిరించింది. దీంతో ఆ యువకుడు తన తమ్ముడితో వచ్చి హతమార్చారు. 

Advertisment
తాజా కథనాలు