JEE Main Exams: జేఈఈ మెయిన్‌ -2 పరీక్షలు ఎప్పుడంటే ?

దేశంలో ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ - 2 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది.

New Update
JEE Main Exam 2

JEE Main Exam 2

దేశంలో ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ - 2 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. ఈ పరీక్షకు హాజరయ్యేవారు ఫిబ్రవరి 25 రాత్రి 9 గంటల లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది. రాత్రి 11.50 గంటల వరకు ఫీజు తీసుకుంటామని పేర్కొంది. 

Also Read: మా సిబ్బంది వారానికి 120 గంటలు పని చేస్తున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

ఇదిలాఉండగా.. జేఈఈ మెయిన్ - 1 పరీక్షలు జనవరిలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను ప్రతీ సంవత్సరం రెండుసార్లు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మెయిన్ -2 పరీక్ష షెడ్యూల్‌ను ఎన్టీఏ ప్రకటించింది. జేఈఈ మెయిన్-2కు అలాగే ఎప్‌సెట్‌ పరీక్షకు మధ్య 20 రోజుల వ్యవధి మాత్రమే ఉండనుంది. అయితే ఈ ఏడాది ఎప్‌సెట్ పరీక్షలు ఏప్రిల్‌ 29 నుంచి మే 5 వరకు జరగనున్నాయి. జేఈఈ పరీక్షలు ముగిసిన తర్వాత ఎప్‌సెట్‌ పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఒత్తిడి తగ్గే ఛాన్స్ ఉందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Also Read: మరో పది రోజుల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. పొంగులేటీ సంచలన ప్రకటన

Also Read: టీ-20 మ్యాచ్ మ్యాచ్ గెలిపించిన గొంగడి త్రిష.. సీఎం రేవంత్ ఏమన్నారంటే ?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు