CINEMA: మళ్ళీ తెరపైకి హీరో గోవిందా విడాకుల కేసు.. అసలు కథ చెప్పిన లాయర్ !

బాలీవుడ్ నటుడు గోవిందా అతడి  భార్య సునీత అహుజా విడాకులు వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. సునీత విడాకుల కోసం కోర్టులో కేసు వేశారని  పలు మీడియా కథనాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో గోవిందా తరుపు న్యాయవాది లలిత్ బింద్రా ఈ వార్తలపై స్పందించారు.

New Update
Actor Govinda

Actor Govinda

CINEMA: బాలీవుడ్ నటుడు గోవిందా అతడి  భార్య సునీత అహుజా విడాకులు వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. సునీత విడాకుల కోసం కోర్టులో కేసు వేశారని  పలు మీడియా కథనాల్లో వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో గోవిందా తరుపు న్యాయవాది లలిత్ బింద్రా ఈ వార్తలపై స్పందించారు. ఇందులో ఏ మాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. గోవిందా విడాకులకు సంబంధించి ఎలాంటి కేసు లేదని కొట్టిపారేశారు. కావాలనే కొంతమంది పాత వార్తలను మళ్ళీ తెరపైకి తీసుకొస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ వినాయకచవితికి వారిద్దరినీ మీరు జంటగా చూస్తారని తెలిపారు. 

గతంలోనూ రూమర్స్.. 

ఇదిలా ఉంటే గతంలో కూడా సునీత- గోవిందా విడాకులు గురించి వార్తలు వచ్చాయి. వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని.. అందుకే ఇద్దరూ వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారని ప్రచారం జరిగింది. త్వరలోనే ఈ జంట తమ 38 ఏళ్ళ వైవాహిక బంధానికి ముగింపు పలకబోతున్నారని పుకార్లు షికార్లు చేశాయి. అప్పుడు కూడా  గోవిందా, అతడి భార్య  సునీత ఈ వార్తలను ఖండించారు. సునీత ఓ యూట్యూబ్ లో వీడియోలో మాట్లాడుతూ దీనిపై క్లారిటీ ఇచ్చారు. తమ బంధాన్ని ఎవరూ విడదీయలేరని, తాము కలిసే ఉన్నామని చెప్పింది.  ''గోవిందా రాజకీయాల్లో ఉండడం వల్ల.. తనను కలవడానికి తరచూ ఇంటికి ఎవరెవరో వస్తుంటారు. దీనివల్ల ఇంట్లో పిల్లలకు ఇబ్బంది కలుగుతుంది. అందువల్లే పిల్లలు, నేనూ వేరే ఇంట్లో ఉండాల్సి వచ్చిందని'' తెలిపింది. అయితే  ఈ విడాకుల విషయంపై సునీత, గోవిందా పలు మార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ మళ్ళీ అలాగే రూమర్లు వినిపించడం గమనార్హం. ఇది మాత్రమే కాదు వీరి  విడాకుల గురించి భిన్నమైన వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఒక వైపు, విడాకుల కేసు కోర్టులో నడుస్తోందని నివేదికలు చెబుతుంటే, మరోవైపు, గోవింద వర్గం మాత్రం ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తోంది.

Also Read: Sreeleela: అదిరింది.. శ్రీలీల హాఫ్ శారీ ఫోటోషూట్‌కి ఫిదా అవుతున్న నెటిజన్లు!

Advertisment
తాజా కథనాలు