Hyderabad Crime : ఆ ఫామ్‌హౌస్‌లో 37 మంది మహిళలు.. 14 మంది పురుషులు..గుట్టుగా యవ్వారం..

మొయినాబాద్‌ మండలం బాకారంలోని ఓ ఫామ్‌ హౌస్‌లో పోలీసులు దాడులు నిర్వహించారు.  ఫామ్‌ హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా లిక్కర్, డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. SKM ఫామ్‌హౌస్‌లో 51 మంది ఆఫ్రికన్లు పట్టుబడ్డారు.

New Update
Africans caught having a drug party in a farmhouse

Africans caught having a drug party in a farmhouse

Hyderabad Crime :  హైదరాబాద్ నగర శివారులోని ఫామ్‌హౌస్‌లు అక్రమ దందాలకు నీలయంగా మారుతున్నాయి. తాజాగా  మొయినాబాద్‌ మండలం బాకారంలోని ఓ ఫామ్‌ హౌస్‌లో పోలీసులు దాడులు నిర్వహించారు.  ఫామ్‌ హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా లిక్కర్, డ్రగ్స్ పార్టీ జరుగుతుండగా పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాకారం గ్రామ పరిధిలోని SKM ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్, లిక్కర్ పార్టీ జరుగుతోందని ఎక్సైజ్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో వారు నార్కోటిక్ బ్యూరో అధికారులతో కలిసి హుటాహుటిన ఫామ్‌‌హౌస్‌‌పై రైడ్‌ చేశారు. ఆ ప్రాంగణంలో చాలా కార్లు ఆగి ఉన్నాయి. అంతే కాదు అక్కడున్న వాళ్లంతా చూడటానికి ఇక్కడి వాళ్లు అస్సలే కాదు.. ఫుల్ సౌండ్.. డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. పోలీసులు  ఎంట్రీ కావడంతో అసలు బండారం బయటపడింది.. SKM ఫామ్‌హౌస్‌లో గుట్టుచప్పుడు కాకుండా లిక్కర్, డ్రగ్స్ పార్టీ జరుపుకుంటున్న 51 మంది ఆఫ్రికన్లు పట్టుబడ్డారు.

ఈ సందర్భంగా అందరికీ డగ్స్ పరీక్షలు నిర్వహించగా.. అందులో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది. అనంతరం ఘటన స్థలానికి ఇమ్మిగ్రేషన్ అధికారులు కూడా చేరుకుని వారి వీసాలను పరిశీలిస్తున్నారు. విదేశీయులంతా పార్టీకి పర్మీషన్ తీసుకున్నారా.. లేదా అని ఆరా తీస్తున్నారు. అసలు పార్టీలోకి విదేశీ మద్యం, డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే విషయంపై ఎక్సైజ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. దాదాపు 100 మంది పోలీసు బందోబస్తుతో బాకారం SKM ఫామ్‌హౌస్‌లో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో ఉగాండా, కెన్యాతోపాటు మరో రెండు ఆఫ్రికన్‌ దేశాలకు చెందిన 51 మందిని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్రనగర్‌ డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు.

‘‘ఉగాండాకు చెందిన మమాస్‌ అనే మహిళ పుట్టిన రోజు సందర్బంగా ఈ పార్టీ నిర్వహించినట్లు తేలింది. ఆమె వీసా గడువు ముగిసినప్పటికీ ఇక్కడ అక్రమంగా నివసిస్తున్నట్లు తేలింది. SKM ఫామ్‌హౌస్‌లో 65 బీర్లు, 20 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నాం. ఇమిగ్రేషన్‌ అధికారులను పిలిపించి వీసాలు సరైనవేవో కాదో చెక్‌ చేస్తున్నాం. పట్టుబడిన 51 మందిలో 12 మంది విద్యార్థులు ఉన్నారు. ఇమ్మిగ్రేషన్‌ అధికారుల తనిఖీలు పూర్తయిన తర్వాత డ్రగ్స్‌ టెస్టులు నిర్వహిస్తాం’’ అని డీసీపీ వెల్లడించారు.

కాగా విదేశీయులంతా ఎక్సైజ్, లోకల్ పోలీసుల పర్మిషన్ లేకుండా ఇష్టారీతిన పార్టీ నిర్వహిస్తున్నట్లు తేలింది. అర్థరాత్రి విపరీతమైన సౌండ్ తో పార్టీ నిర్వహించినట్లు వెల్లడైంది. దీంతో సౌండ్ వయలేషన్ కింద కేసు నమోదు చేసినట్లు  పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా పార్టీ నిర్వహించడంపై నిర్వాహుకులతో పాటు ఫామ్ హౌస్ యజమాని పై కూడా కేసు నమోదు చేస్తామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.  ఘటన స్థలంలో  లిక్కర్ తో పాటు హుక్కా ను గుర్తించినట్లు తెలిపారు.  అందులో 19మంది నైజీరియన్ లు వీసా గడువు ముగిసిన ఇక్కడే  ఉన్నట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు గుర్తించారు. మిగతా 26 మందిపై తనిఖీలు కొనసాగుతున్నాయి. పట్టుబడ్డవారిలో 6గురు నైజీరియన్ లకు నోటీసులు ఇచ్చి పంపారు  పోలీసులు. మరో ఆరుగురు విదేశీ విద్యార్ధులు వివిధ యూనివర్సిటీ లో చదువుతున్నట్టు గుర్తించారు. వీసా గడువు ముగిసిన వాళ్ళందరిని తిరిగి డిపోర్టేషన్ చేయనున్నారు.

Also Read : దేశానికి స్వాతంత్రం వచ్చినా..హైదరాబాద్ మాత్రం చీకట్లోనే...ఎందుకో తెలుసా?

Advertisment
తాజా కథనాలు