/rtv/media/media_files/2025/03/14/jkaPi5aITo3EBOUhZRkn.jpg)
KTR vs Revanth Reddy
KTR: హైదరాబాద్ వాసులకు కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకాన్ని ముట్టుకుంటే ముఖ్యమంత్రి మసే అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఎక్స్ వేదికగా మంగళవారం కేటీఆర్ ఒక ప్రకటన చేశారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిప్రింట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియా క్లిప్ను దానికి జతచేశారు.
Now this the real AI - “Anumula Intelligence” 😂
— KTR (@KTRBRS) August 5, 2025
Please do watch this lesson in Foreign Policy and diplomacy
Kitne Tejasvi Log Hain Yeh Congress Wale 👏 https://t.co/n7pkCF4mUE
ఉచిత మంచినీటి పథకాన్ని అనవసర ఖర్చుగా రేవంత్ అభివర్ణించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ వాసులకు కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకాన్ని ముట్టుకుంటే ముఖ్యమంత్రి మసే.. అంటూ కేటీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. అధికారం చేపట్టి 20 నెలలు కావస్తున్నా.. ఇచ్చిన 420 హామీలు అమలు చేయలేక ఇప్పటికే చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి మహా పాపాన్ని మూటగట్టుకున్నారని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలకు కూడా ఉరివేయాలని చూస్తే.. మహానగరంలోని కోటి 20 లక్షల మంది ప్రజలు చరిత్రలో కాంగ్రెస్ పార్టీని, సీఎం రేవంత్‌ను క్షమించరని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి:UP crime : ఓరెయ్ కామాంధుడా... ప్రైవేట్ పార్ట్స్ తాకి పారిపోయాడు.. యోగి స్టైల్ ట్రీట్మెంట్ ఇచ్చారు!
రైతులకు సాగునీరు ఇవ్వలేని ఈ దద్దమ్మ సర్కారు, ఇప్పుడు హైదరాబాద్ లో ఉచిత తాగునీటి పథకానికి కూడా పాతరేయాలని చూడటం ముఖ్యమంత్రి మూర్ఖత్వానికి పరాకాష్ట అంటూ తీవ్రంగా ద్వజమెత్తారు. ఇప్పటికే హైడ్రా వంటి దిక్కుమాలిన నిర్ణయాలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసి తీరని నష్టాన్ని కలిగించారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రగతి ప్రస్థానంలో రెప్పపాటు కూడా కరెంటు కోతలు లేని రాజధాని వాసులకు మళ్లీ కరెంట్ కష్టాలను పరిచయం చేసిన పాపం రేవంత్ రెండ్ దే అంటూ కేటీఆర్ వివర్శించారు. ఓవైపు అస్తవ్యస్తంగా మారిన డ్రైనేజీ వ్యవస్థ, ఇంకోవైపు వర్షాలకు దెబ్బతిన్న రోడ్లతో ప్రజలు అవస్థలు పడుతుంటే.. ఫ్రీ వాటర్ స్కీమ్ ను కూడా గండికొట్టాలని చూస్తున్న రేవంత్ కు కర్రు గాల్చి పెట్టేందుకు హైదరాబాద్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని దెప్పిపొడిచారు.
ఇది కూడా చూడండి:Hyderabad: హైదరాబాద్ లో కసాయి భర్త.. ప్రియురాలి కోసం భార్య, పిల్లల్ని ఏం చేశాడంటే!
కాగా భారత ఎన్నికల కమిషన్ ఆహ్వానం మేరకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ నేతలు మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఎన్నికల సంస్కరణలు, ఈసీఐకి ఇప్పటికే సమర్పించిన ప్రతిపాదనలు, ప్రవర్తనా నియమావళి సంబంధిత అంశాలపై ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బీఆర్‌ఎస్ నేతలు ఈసీతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, ఒద్దిరాజు రవిచంద్ర,మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, బీఆర్‌ఎస్ నాయకులు బాల్కసుమన్, ఆర్.ఎస్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొననున్నారు.
Also Read : మందుల ధరలు తగ్గాయి: పేద, మధ్యతరగతికి కేంద్రం ఊరట