Kancha Gachibowli : పర్యావరణ నష్టం పూడ్చలేకపోతే సీఎస్ జైలుకు వెళ్లాల్సిందే... కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కంచ గచ్చిబౌలి భూముల వివాదం ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.  కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టిన్ జార్జ్ లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి.

New Update
Supreme Court makes harsh comments

Supreme Court makes harsh comments

Kancha Gachibowli :  దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కంచ గచ్చిబౌలి భూముల వివాదం ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది.  కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గవాయ్‌, జస్టిస్‌ అగస్టిన్ జార్జ్ లతో కూడిన ధర్మాసనం ముందు వాదనలు జరిగాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి తన వాదనలు వినిపించారు. “అమైకస్ క్యూరీ” గా పరమేశ్వరన్ వ్యవహరించారు. విచారణ సందర్భంగా వివరాలను పరిశీలించిన సీజేఐ తెలంగాణ ప్రభుత్వంపై సీరియస్‌ అయ్యారు.  

ఇది కూడా చూడండి: RRR 2: చరణ్, తారక్.. జక్కన్నను ఎలా ఆటపట్టించారో చూడండి.. RRR 2 పై రాజమౌళి రియాక్షన్! (వీడియో)

ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెట్లను తొలగించేందుకు  ఇష్టానుసారంగా డజన్ల కొద్ది బుల్డోజర్లు ఉపయోగించారని మండిపడ్డారు. ముందస్తు ప్లాన్‌ ప్రకారమే ఇదంతా చేసినట్లుగా ఉందని ఆరోపించారు. అలాగే ప్రభుత్వ చర్యల వల్ల పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగిందని, ఆ పర్యావరణ నష్టాన్ని పూడ్చకపోతే సీఎస్‌ తో పాటు సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సిందేనని హెచ్చరించారు.తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేసింది.

ఇది కూడా చూడండి: Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు
 
కాగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వం వేలం వేసే ప్రయత్నం చేసింది. దీన్ని  నిరసిస్తూ విద్యార్థిలోకం నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పారిశ్రామిక అభివృద్ధి కోసం చెట్లను నరికేసి భూములను వేలం వేయడాన్ని పర్యావరణవేత్తలు ఖండించారు. ఈ నేపథ్యంలో కంచ గచ్చిబౌలి HCU భూముల విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇది కూడా చూడండి: Balochistan: మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించండి..బలూచ్ నాయకుడి భావోద్వేగ పోస్ట్
 
గత విచారణ సందర్భంగా నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణం, వన్యప్రాణుల రక్షణకు ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుందో వివరిస్తూ అపిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటివరకు యధాతధ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఈలోగా ఒక్క చెట్టు కూడా నరకడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా రాత్రికి రాత్రి బుల్డోజర్లతో సుమారు వంద ఎకరాల్లో ధ్వంసం చేసిన పర్యావరణాన్ని ఎలా పునరుద్ధరణ చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.  

ఇది కూడా చూడండి: Revanth Reddy : కేటీఆర్ కింద కాదు కొప్పుల కింద పనిచేస్తే గొప్ప..హరీష్ రావుకు సీఎం రేవంత్ చురకలు

 

Advertisment
Advertisment
తాజా కథనాలు