Raja Singh : నేను బీజేపీకి నిజమైన సైనికుడిని..Rtv వార్తకు స్పందించిన MLA రాజసింగ్

గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజసింగ్ తిరిగి బీజేపీలో చేరుతున్నాడన్న వార్తలపై ఆయన స్పందించారు.ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉండి, ఒక అన్నయ్య గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోతే, ముందుగానే లేదా తరువాత ఆ సోదరుడు ఇంటికి తిరిగి రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

New Update
FotoJet (14)

I am a true soldier of BJP.. MLA Rajsingh

Raja Singh : గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజసింగ్ తిరిగి బీజేపీలో చేరుతున్నాడన్న వార్తలపై ఆయన స్పందించారు.ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉండి, ఒక అన్నయ్య గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోతే, ముందుగానే లేదా తరువాత ఆ సోదరుడు ఇంటికి తిరిగి రావాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈరోజు కాకపోతే, రేపు నేను కూడా నా ఇంటికి తిరిగి వెళ్ళవలసి ఉంటుందని తేల్చి చెప్పారు. ఆ శుభ సమయం ఎప్పుడు వస్తుందో నేను మీకు చెప్పలేను అన్నారు.

నేను భారతీయ జనతా పార్టీకి నిజమైన సైనికుడిని అన్న రాజాసింగ్‌. ఢిల్లీ లేదా రాష్ట్ర ముఖ్యనాయకులు నన్ను పిలిచిన రోజు, నేను నా పార్టీకి తిరిగి వస్తానన్నారు. నేను ఇంతకు ముందు కూడా ఇదే అభ్యర్థన చేశాను. ఈ రోజు కూడా అదే అభ్యర్థన చేస్తున్నాను. మన అసెంబ్లీలో స్వేచ్ఛ కల్పించాలి. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీకి వారి నియోజకవర్గంలో స్వేచ్ఛ ఇవ్వాలి. అప్పుడే మన పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి రాగలదని అభిప్రాయపడ్డారు.

ఈరోజు కాకపోయినా రేపు నాకు ఢిల్లీలోని మా పెద్ద నాయకుల నుండి లేదా రాష్ట్రంలోని మా పెద్ద నాయకుల నుండి పిలుపు వస్తుందని నాకు ఖచ్చితంగా తెలుసు అని రాజాసింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇవ్వాళ లేకపోతే రేపు మా పెద్దోళ్ళ నుంచి నాకు ఫోన్ వస్తే ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తాను నేను మా పెద్ద నాయకులు తోని మాకు స్వేచ్ఛ ఇవ్వండి అని ఆయన స్పష్టం చేశారు. దాని తర్వాత చూడండి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలతో మేము ఏ విధంగా యుద్ధం చేస్తామో అంటూ రాజాసింగ్‌ చెప్పుకొచ్చారు.

Advertisment
తాజా కథనాలు