HYDRA: రేవంత్‌ సర్కార్ కీలక నిర్ణయం.. మూసీలోకి త్వరలో హైడ్రా ప్రవేశం

హైదరాబాద్‌లో మసీ నది సుందరీకరణలో భాగంగా ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. మూసీ రివర్‌బెడ్‌ ఏరియాలో 2,166 ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి కూల్చివేతల బాధ్యతను కూడా ప్రభుత్వం హైడ్రాకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

New Update
HYDRA on Musi

హైదరాబాద్‌లో మసీ నది సుందరీకరణ కోసం పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు మూసీపై సర్వే చేస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత హైడ్రా రంగంలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ముసీలో బఫర్‌ జోన్‌లో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చే బాధ్యతను ప్రభుత్వం హైడ్రాకే అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అయితే మూసీ రివర్‌బెడ్‌ ఏరియాలో 2,166 ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడ ఉంటున్న వాళ్లకు అవగాహన కల్పించి డబుల్‌బెడ్‌ రూం ఇళ్లల్లోకి తరలించేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. దాదాపు 80 శాతం మంది డబుల్‌బెడ్‌రూం ఇళ్లల్లోకి వెళ్లే ఛాన్స్ ఉందని.. మిగతా 20 శాతం మంది తాము చెప్పింది వినకుంటే ఎలాగైనా నచ్చజెప్పి పంపేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

Also Read: నా వెనుక ఉండి నాపై కుట్ర చేశారు: జానీ మాస్టర్

 ఒకవేళ ఇలా వినని పక్షంలో హైడ్రా కూల్చివేతలు జరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. అక్కడ ఉంటున్నవారికి రెవెన్యూ శాఖ నోటీసులిచ్చి మార్కింగ్ చేశాక కూల్చివేతలు జరుగుతాయని చెబుతున్నారు. మొత్తంగా మూసీ రివర్‌ బెడ్‌, బఫర్‌ జోన్‌లో 16 వేల ఆక్రమణలను హైడ్రా తొలగించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కూల్చివేతలకు అవసరమైన సామగ్రి, సిబ్బందిని సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైడ్రా అధికారులతో జరిగిన పలు సమావేశాల్లో కమిషనర్ రంగనాథ్‌ కూడా మూసీ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఆక్రమణలు తొలగించే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయన్న దానిపై ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ప్రాంతాలను బట్టి స్పెషల్‌గా బృందాలను ఏర్పాటు చేయాలని.. సున్నితమైన ప్రదేశాల్లో అదనపు బలగాలను దింపాలని హైడ్రా భావిస్తోంది. 

హైడ్రా ఇప్పటిదాకా 27 ప్రాంతాల్లో 311 కూల్చివేతలు చేసింది. ఇందుకోసం పెద్ద పెద్ద యంత్రాలనే వినియోగించింది. ఎందుకంటే అక్కడ భారీగా షెడ్లు ఉండట, అయిదారు అంతస్తుల భవనాలు ఉండటం వల్ల వాటిని కూల్చేందుకు భారీ యంత్రాలను వినియోగించాల్సి వస్తోంది. కానీ మూసీ నది విషయానికొస్తే మాత్రం ఇక్కడ చాలావరకు చిన్న చినన ఇళ్లు మాత్రమే కనిపిస్తాయి. వీటిని కూల్చడం కోసం పెద్ద యంత్రాలు కాకుండా చిన్న యంత్రాలే సరిపోతాయని హైడ్రా అనుకుంటోంది. ఎక్కవ సంఖ్యలో చిన్న యంత్రాలను పెట్టే కూల్చివేయాలని ప్లాన్ చేస్తోంది. అంతా అనుకున్నట్లు సజావుగా సాగితే మూడు రోజుల్లోనే పని పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

Also Read: రాయదుర్గం పీఎస్ లో ఆర్‌పీ పట్నాయక్ ఫిర్యాదు.. చెవి కొరికాడంటూ..!

#telugu-news #hyderabad #musi-river #hydra
Advertisment
Advertisment
తాజా కథనాలు