Johnny Master : నా వెనుక ఉండి నాపై కుట్ర చేశారు: జానీ మాస్టర్

లైంగిక వేధింపుల కేసులో కస్టడీలో ఉన్న జానీ మాస్టర్‌ను పోలీసులు మూడో రోజు విచారణ చేపట్టారు. బాధితురాలిపై తాను ఎలాంటి లైంగిక దాడి చేయలేదని, తన ఎదుగుదలను చూడలేక వెనుక ఉండి కుట్రచేశారని జానీ మాస్టర్ విచారణలో తెలిపినట్లు తెలుస్తోంది.

New Update
jani master case

లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన జానీ మాస్టర్‌ను కస్టడీ విచారణను పోలీసులు మూడో రోజు కొనసాగించారు. రెండుసార్లు బాధితురాల నుంచి స్టేట్మెంట్ తీసుకున్న పోలీసులు ఆధారాలను రికార్డు చేశారు. అనారోగ్యంతో ఉండటంతో మాస్టర్‌కు నిన్న వైద్య పరీక్షలు నిర్వహించారు. బాధితురాలు సమర్పించిన ఆధారాలతో జానీ మాస్టర్‌ను విచారణ చేస్తున్నారు. అయితే ఢీ షో ద్వారా తనకి తానుగా ఆమె తనను పరిచయం చేసుకుందని, బాధితురాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని జానీ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. మైనర్‌గా ఉన్నప్పుడు ఆమెపై లైంగిక దాడి చేయలేదని, ఆమె చెప్పేది అబద్ధమని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.

నా ఎదుగుదల చూడలేక..

బాధితురాలికి ఉన్న టాలెంట్‌ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చానని జానీ పోలీసులకు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ బాధితురాలు తనని పెళ్లి చేసుకోవాలని మానసికంగా హింసించిందని విచారణలో తెలిపినట్లు సమాచారం. ఎన్నోసార్లు బెదిరించిందని.. ఇబ్బంది పడలేక డైరెక్టర్ సుకుమార్‌కి చెప్పానని జానీ మాస్టర్ అన్నట్లు తెలుస్తోంది. సుకుమార్ ఆమెను పిలిచి మాట్లాడిన కూడా బాధితరాలిలో ఎలాంటి మార్పు రాలేదని జానీ పోలీసులకు వివరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కావాలనే తనపై కుట్ర చేశారని, నా ఎదుగుదలను చూడలేక ఈ కేసులో ఇరికించారని జానీ మాస్టర్ విచారణ సందర్భంగా అన్నట్లు తెలుస్తోంది.

Also Read :  ''మీ ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటా''.. ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ ట్వీట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు