BREAKING: తెలంగాణలో కాంగ్రెస్ నేత దారుణ హత్య!

తెలంగాణలో రాజకీయ హత్య కలకలం రేపింది. కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు జాబితాపూర్‌లో మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి (58) దారుణహత్య గురయ్యాడు. కారుతో ఢీకొట్టి, కత్తితో పొడిచి దారుణంగా చంపారు దుండగులు.

New Update
Telangana Congress: పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ కమిటీ భేటీ

MLC Jeevan Reddy: తెలంగాణలో రాజకీయ హత్య జరిగింది. కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ముఖ్య అనుచరుడు జాబితాపూర్‌లో మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి (58) దారుణహత్య గురయ్యాడు. కారుతో ఢీకొట్టి, కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు సంతోష్. తీవ్ర గాయాలతో ఉన్న గంగిరెడ్డిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. గంగిరెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శించారు. 

గంగిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యంలో కాంగ్రెస్ నేతలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. కాగా సంతోష్ పై పలుమార్లు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని గంగిరెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా కాంగ్రెస్ నేత గంగిరెడ్డి మృతికి నిరసనగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జగిత్యాల-ధర్మపురి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. నిందితుడికి కఠిన శిక్ష పడాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు