HYDRA: మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు..

సోమవారం మాదాపూర్‌లో కావూరి హిల్స్‌లోని పార్కు ప్రాంతంలో నిర్మించిన ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. పార్కులో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్‌ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్‌ అసోసియేషన్‌ ఫిర్యాదు చేయడంతో అధికారులు అకాడమీ నిర్మాణాలు తొలగించారు.

author-image
By B Aravind
New Update
Madhapur

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సోమవారం హైడ్రా మాదాపూర్‌లో ఆక్రమణలను నేలమట్టం చేస్తోంది. కావూరి హిల్స్‌లోని పార్కు ప్రాంతంలో నిర్మించిన ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. పార్కులో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్‌ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్‌ అసోసియేషన్‌ ఫిర్యాదు చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే సోమవారం అధికారులు అకాడమీ నిర్మాణాలు తొలగించారు, ఆ తర్వాత అక్కడ కావూరి హిల్స్ పార్కు అని బోర్డు ఏర్పాటు చేశారు.

Also Read: అర్ధరాత్రి వరకు కొనసాగిన హైడ్రా కూల్చివేతలు..

 మరోవైపు దీనిపై స్పోర్ట్స్‌ అకాడమీ నిర్వాహకులు స్పందించారు. కావూరి హిల్స్‌ అసోసియేషన్ తమకు 25 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చిందని తెలిపారు. ఆ గడువు ముగియక ముందే నిర్మాణాలను అన్యాయంగా తొలగిస్తున్నారని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ స్పష్టం చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు