HYDRA: మళ్లీ దూకుడు పెంచిన హైడ్రా.. నెక్ట్స్ టార్గెట్ ఆ ఏరియానే!

హైదరాబాద్ లో హైడ్రా మళ్లీ దూకుడు పెంచుతోంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురాగా.. గవర్నర్ ఆమోద ముద్ర వేయడతో మరింత వేంగంగా ముందుకెళ్తోంది. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లో అక్రమ కట్టడాలను కూల్చేందుకు రంగం సిద్ధం చేసింది. 

author-image
By srinivas
hmsgar
New Update

HYDRA: హైదరాబాద్ లో హైడ్రా మళ్లీ దూకుడు పెంచుతోంది. కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత, హైడ్రా చట్టబద్దతపై హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చిన హైడ్రా.. అక్రమ కట్టడాలపై మరోసారి ఉక్కుపాదం మోపుతోంది. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురాగా.. గవర్నర్ ఆమోద ముద్ర వేయటంతో మరింత వేంగంగా ముందుకు వెళ్తోంది. 

హిమాయత్ సాగర్ ప్రాంతంపై ఫోకస్..

ఈ మేరకు తాజాగా హైడ్రా అధికారులు హిమాయత్ సాగర్ ప్రాంతంపై ఫోకస్ పెట్టారు. హిమాయత్ సాగర్ జలాశయం బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్ గుర్తించేందుకు చర్యలు చేపట్టారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ఆధారంగా సర్వే చేయాలని హైడ్రా నిర్ణయించింది. 2010 నుంచి 2024 వరకు హిమాయత్ సాగర్ పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఉస్మాన్ సాగర్‌పై దృష్టి పెట్టేలా హైడ్రా అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తుండగా.. రెండో విడతగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలోని 549 చెరువులకు హైడ్రా సర్వే చేపట్టనుంది. అందుకు అనుగుణంగా FTL, బఫర్ జోన్ గుర్తించేందుకు 411 చెరువులకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ సైతం జారీ చేశారు.

ఇది కూడా చదవండి: Pawan Vs Stalin: పవన్ Vs స్టాలిన్.. దక్షిణాదిలో బీజేపీ బిగ్ స్కెచ్!

ఇక ప్రతి చెరువుకు జియో ట్యాగింగ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చెరువులు, కుంటలను ఎవరూ ఆక్రమించకుండా రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు పక్కాగా లెక్కలు సిద్ధం చేస్తున్నారు. డిజిటల్‌ సర్వేల సహాయంతో చెరువుల విస్తీర్ణాన్ని, ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌ను డిసైడ్ చేసి.. వాటికి జియో ట్యాగింగ్ చేసి హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. అలాగే కూకట్‌పల్లిలో హైడ్రా అధికారులు కూల్చివేతలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.  

ఇది కూడా చదవండి: భద్రాధ్రిలో వింత సంఘటన.. తనను పరమశివుడు ఆవహించాడంటూ బాలుడి హల్చల్

#hyderabad #hydra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe