భద్రాధ్రిలో వింత సంఘటన.. తనను పరమశివుడు ఆవహించాడంటూ బాలుడి హల్చల్ భద్రాధ్రికొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కమలాపురం గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. తనను పరమశివుడు ఆవహించాడంటూ అశోక్ (18) అనే బాలుడి వింత ప్రవర్తన చుట్టుపక్కల ప్రజలను షాక్ కు గురి చేసింది. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 06 Nov 2024 in తెలంగాణ ఖమ్మం New Update షేర్ చేయండి భద్రాధ్రికొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కమలాపురం గ్రామంలో వింత సంఘటన చోటు చేసుకుంది. తనను పరమశివుడు ఆవహించాడంటూ అశోక్ (18) అనే బాలుడి వింత ప్రవర్తన చుట్టుపక్కల ప్రజలను షాక్ కు గురి చేసింది. ఊరిచివర ఓపుట్టలో తానున్నానని.. త్రవ్వి వెలికితీయాలంటూ అశోక్ గ్రామస్థులను కోరాడు. తాను చూపించిన ప్రదేశంలో త్రవ్వకాలు జరిపితే నందీ, మహా శివలింగం బయటపడి సత్యం బోధపడుతుందని చెబుతున్నాడు. తరతరాలనుంచి పుట్టలో నందీశ్వరులు కొలువై ఉన్నారని, తనకు కలలో సాక్షాత్కారమై పూజలు చేయాలని కోరినట్లు అశోక్ తెలిపాడు. కాగా అశోక్ రెండునెలలుగా ఉపవాసం ఉంటూ చప్పిడి పాలు మాత్రమే తాగుతున్నట్లు తెలుస్తోంది. Also Read : తిరుపతి లడ్డూ వివాదం..రంగంలోకి దిగిన CBI ఇక మలాపురం గ్రామస్థులు అశోక్ చెప్పినట్టుగా తాను చూపించిన ప్రదేశంలో త్రవ్వకాలు మొదలుపెట్టారు. అయితే త్రవ్వకాలు జరుపుతున్న ప్రదేశం అటవీశాఖ పరిధిలోనిది కావడంతో అధికారుల అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామస్థులు ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం ఇప్పటివరకు ఆరడుగుల లోతు వరకు త్రవ్వకాలు జరిపారు. కానీ ఇప్పటివరకూ విగ్రహాల ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో అశోక్ ప్రవర్తనతో కమలాపురం గ్రామస్థులు అయోమయంలో పడ్డారు. Also Read : రానా, తేజ సజ్జా పై మహేష్ ఫ్యాన్స్ ఫైర్.. క్షమాపణ చెప్పాల్సిందే అంటూ? మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి