Old City fire: చేతిలో ఫోన్ టార్చ్ లైట్‌తో చనిపోయిన మహిళ.. ఆ తల్లి త్యాగం తెలిస్తే కంటనీరే!!

ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్‌లో పిల్లల ప్రాణాలు రక్షించాలని ప్రయత్నించి చనిపోయింది. చీకట్లో ఫోన్ టార్జ్ లైట్ చేతిలో పట్టుకొని పిల్లలని కాపాడాలని అన్నీ రూమ్‌లు తిరిగింది. చివరికి చేతిలో ఫోన్‌ పట్టుకొనే పొగతో ఉపిరాడక ప్రాణాలు వదిలింది.

New Update
Old City fire

Old City fire (AI Genarated Image)

హైదరాబాద్ పాతబస్తీ అగ్నిప్రమాదంలో 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫైర్ యాక్సిడెంట్‌లో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి. మృతుల్లో 8 మంది చిన్నారులు, నలుగురు మహిళలు ఉండటం బాదాకరం. అయితే ఎనిమిది మంది చిన్నారులను రక్షించాలని ఓ మహిళ ప్రాణాలు పణంగా పెట్టింది. గ్రౌండ్ ఫ్లోర్‌తోపాటు మరో రెండు అంతస్తులో షార్ట్ సర్య్కూట్ అయ్యింది. 3 ఏసీ కంప్రెషర్లు పేలి మంటలు చెలరేగాయి. అదే మంటల్లో ముగ్గురు సజీవదహనమైయ్యారు. 14 మంది పొగ కారణంగా ఊపిరాడక చనిపోయారు. పొగ కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న చిన్నారులను రక్షించాలని సుమిత్ర (60) చాలా ప్రయత్నించింది. ఆమె స్పృహ కోల్పోయేంత వరకూ సెల్ ఫోన్ టార్చ్‌తో చీకట్లో పిల్లలను వెతుకుతూనే ఉంది. చివరికి ఆమె అదే సెల్‌ఫోన్ టార్చ్ చేతిలో పట్టుకొనే మరణించింది. ఫైర్ యాక్సిడెంట్ టైంలో దాదాపు 30 మంది అదే బిల్డింగ్‌లో ఉన్నారు. 

ప్రమాదంలో బయటపడ్డవారు ఆమె గురించి పోలీసులకు చెప్పారు. ఆమె చేసిన సహసానికి హ్యాట్సాఫ్ అనే చెప్పాలి. ఆమె బయటపడే అవకాశం ఉన్నా.. పిల్లలను రక్షించాలని గట్టిగా ప్రయత్నించింది. సెల్‌ఫోన్ టార్చ్ లైట్‌తో  బిల్టింగ్‌లో అన్నీ రూమ్‌లు తిరిగింది. చాలాసేపు ఆమె చీకట్లోనే పిల్లల కోసం వెతికి చివరికి పొగ కారణంగా ఊపిరి ఆడక ప్రాణాలు వదిలింది. సుమిత్ర తెగువ, త్యాగం గురించి మాట్లాడుకుంటున్నారు.

పశ్చిమబెంగాల్‌‌‌‌కు చెందిన ప్రహ్లాద్‌‌‌‌ మోదీ(70), రాజేందర్ మోదీ(65) ఇద్దరు అన్నదమ్ములు. వారి కుటుంబాలు 50 ఏండ్లుగా చార్మినార్​దగ్గర ఉన్న గుల్జార్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌ ఏరియాలో స్థిరపడ్డారు. జ్యువెలరీ వ్యాపారం నిర్వహిస్తున్నాయి. ఈ రెండు కుటుంబాలకు చెందిన పంకజ్ మోదీ (36), అభిషేక్‌‌‌‌ (31) చంద్రాయణగుట్ట, ఉప్పరపల్లి గౌతంనగర్‌లో నివాసముంటున్నారు. వీళ్లంతా గుల్జార్ హౌస్‌‌‌‌ చౌరస్తాలోని జీ ప్లస్ 2 బిల్డింగ్‌‌‌‌లో కృష్ణ పెరల్స్‌‌‌‌, మోదీ జ్యువెలర్స్ పేరుతో జ్యువెలరీ షాపులు నిర్వహిస్తున్నారు. శనివారం ఫ్యామిలీ గెట్‌టూ గెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.

old-city | hyderabad old city | fire incident in old city | fire accident in old city | fire incident in hyderabad old city | hyderabad old city woman | latest-telugu-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు