కొత్త ఐఏఎస్ అధికారుల నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు

హైకోర్టు తీర్పుతో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లనున్న ఐఏఎస్‌ అధికారుల స్థానంలో కొత్త అధికారుల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న ఆమ్రాపాలి స్థానంలో మరొకరు రానున్నట్లు తెలుస్తోంది.

amra
New Update

IAS Officers: ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలన్న క్యాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణలో పని చేస్తున్న ఐఏఎస్‌ ఆఫీసర్లకు హైకోర్టు (High Court) షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఐఏఎస్ అధికారులు వాణి ప్రసాద్‌, వాకాటి కరుణ, రొనాల్డ్‌ రోస్‌, ఆమ్రపాలి, సృజన, శివశంకర్‌, హరికిరణ్‌ తమను ఏపీకి పంపించొద్దని వేడుకున్నా ఊరట దక్కలేదు. రిలీవ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్నా వారి పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ముందు వెళ్లి ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ప్రజా సేవ కోసం ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడకు వెళ్లి పని చేయాల్సిందే అని స్పష్టం చేసింది. 

Also Read: కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు తప్పిన ప్రమాదం.. హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్!

కొత్త జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎవరూ ?

హైకోర్టు  తీర్పుతో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లనున్న ఐఏఎస్‌ అధికారుల స్థానంలో కొత్త అధికారుల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రాస్‌ సమావేశమయ్యారు. అలాగే మరో ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కూడా ఏపీ వెళ్లనుండటంతో ఆమె స్థానంలో కొత్త జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను నియమించేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. 

Also Read: కొత్తగా పెళ్లయిందా? ఈ మూడు పాటిస్తే మీ భార్య మిమల్ని ఎప్పటికీ వదలదు!

ఇందుకోసం పలువురి అధికారుల పేర్లను పరిశీలిస్తోంది. మూసీ ప్రక్షాళన, అలాగే వచ్చే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కసరత్తులు చేస్తోంది. అయితే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్‌కు బాధ్యలు అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు జీహెచ్‌ఎంసీ కమిషనర్లను మార్చింది. అమ్రపాలి ఏపీకి వెళ్లనుండటంతో ఈ స్థానంలోకి ఎవరు వస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. 

Also Read: రైతులకు మోదీ సర్కార్ అదిరిపోయే దీపావళి గిఫ్ట్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు!

Also Read: ఖగోళ అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు రాదు!

#cm-revanth #telangana #amrapali-ias #amrapali
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe