సికింద్రాబాద్ స్టేషన్‌లో కీలక మార్పులు.. ప్రయాణికులు తప్పక తెలుసుకోవాల్సిన వివరాలివే!

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్లాట్‌ఫామ్ నెం.1కి గేట్‌కి బదులు నెం.2 దగ్గర కొత్త ప్రవేశ ద్వారం ఓపెన్ చేశారు. అలాగే జనరల్ బుకింగ్ కౌంటర్‌, 750 మంది ప్రయాణీకులు ఉండే కొత్త వెయిటింగ్ హాల్‌ను ఏర్పాటు చేశారు.

New Update
Secunderabad Railway Station

Secunderabad Railway Station Photograph: (Secunderabad Railway Station)

దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ స్టేషన్‌ను రూ.720 కోట్లతో అప్‌గ్రేడేషన్ చేస్తోంది. దీనిలో భాగంగా ప్రస్తుతం స్టేషన్‌లో సివిల్ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్తరం వైపున ఉన్న స్టేషన్ భవనాన్ని కూల్చేసి కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ పనులు జరుగుతున్న సమయంలో రైలు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇది కూడా చూడండి:This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే

కొత్త వెయిటింగ్ హాల్‌ను..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రద్దీని క్రమబద్దీకరించేందుకు కొన్ని రూల్స్ మార్చారు. ప్లాట్‌ఫామ్ నెం.1కి గేట్‌కి బదులు నెం.2 దగ్గర కొత్త ప్రవేశ ద్వారం ఓపెన్ చేశారు. గణేష్ ఆలయం పక్కనే ఈ ఎంట్రీ ఉంటుంది. అలాగే జనరల్ బుకింగ్ కౌంటర్‌తో పాటు విచారణ, 750 మంది ప్రయాణీకులు ఉండగలిగే సామర్థ్యంతో కొత్త వెయిటింగ్  హాల్‌ను కూడా ఏర్పాటు చేశారు. గేట్ 4 మూసి వేసి.. గేట్ నంబర్ 3 దగ్గరే ఎక్స్‌ట్రాగా ఎంట్రీ ఇచ్చారు.

ఇది కూడా చూడండి:Breaking News : కాంగ్రెస్ మాజీ ఎంపీకి బిగ్ షాక్.. ఢిల్లీ కోర్టు జీవిత ఖైదు!

ప్లాట్‌ఫామ్ నంబర్ 10 లోని గేట్ నంబర్ 8 (భోయిగూడ వైపు ప్రవేశ ద్వారం) వద్ద జనరల్ బుకింగ్ సౌకర్యంతో పాటు ఎంట్రీ ఓపెన్ చేశారు. అలాగే దారులను తెలియజేయడానికి బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా కూడా వెంటనే స్పందించేందుకు ఏర్పాట్లు చేశారు. 24 గంటల పాటు కూడా స్టాళ్లు పని చేస్తూనే ఉంటాయని చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్ తెలిపారు.ః

ఇది కూడా చూడండి:TG JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మరో 50 వేల ఉద్యోగాలకు సీఎం గ్రీన్ సిగ్నల్!

ఇది కూడా చూడండి:Viral Video: రోజులు మారాయ్.. మేము కూడా డాన్సర్లమే బాబూ - అర్చకుల బ్రేక్ డాన్స్‌తో కిక్కిరిసిపోయిన రోడ్లు!

Advertisment
తాజా కథనాలు